Wednesday, 9 June 2010

Telangana By Elections

కాంగిరేసోడి పీక గుంజితే...
టిడిపి బాబు డొంకా కదిలే...

మొదలైంది రెండు కళ్ళ లొల్లి...
మనం తెరవాలి మూడో కన్ను... 

అర్రే యేవ్వాడైతే ఏందిరా గోడ మీద పిల్లులే... 
తెలంగాణను దోచుకోనీకి తెగబడ్డ గద్దలే..
తెల్లా పంచె కాంగిరేసోడైనా..
పచ్చ కామెర్ల టిడిపి ఓడైనా..

తెలంగాణ తెచ్చేది ఇచ్చేది మేమే అని పోసులు గొట్టి 
అమరుల మీద మేము మాజీలమని ప్రమాణం చేసి

మంత్రి పదవుల కోసం మాటలు మార్చేటోల్లు
పట్టా భూముల కోసం పంగా నామాలు పెట్టేటోల్లు
శవాల మీద పేలాలు ఏరుకునే బిచ్చగాళ్ళు 
డబ్బు కట్టల కోసం సొల్లూ నాకే సన్నాసులు 
 
అర్రే జాతర పోదాం రాజన్న...వీల్ల పాతర ఏద్దాం ఎల్లన్న
పలుగు పట్టు పుల్లన్న..వీల్ల పాడే కట్టు మల్లన్న 
 
జాతర పోదాం రాజన్న...వీల్ల పాతర ఏద్దాం ఎల్లన్న 
పలుగు పట్టు పుల్లన్న..వీల్ల పాడే కట్టు మల్లన్న
 
అర్రే పిల్లీ గడ్డం మామ..యాడ బాయే నీ రెండో కన్ను 
అర్రే తకదిమితోం తయ్యం.. మాతో పెట్టుకోకు కయ్యం
జర్ర పుంగి బజాయేన్గే.. తు తెలంగాణ చోడ్కే జాన