Monday, 12 August 2013

Understanding the Benefits Of Organic Food

In today’s world, we hear about organic versus conventional food all of the time and often wonder just what the benefits of organic foods are? About a year ago, redOrbit published an article explaining that organic foods have no more nutritional value than conventional foods. That is to say, the nutrients, vitamins, and minerals found in organic foods equaled those found in non-organic foods. So an orange grown organically has about the same amount of vitamin C as an orange grown conventionally has. However, there are other benefits of organic foods than just what nutrients we get from them.

First of all, what is the difference between organic and conventional foods? According to the Mayo Clinic, some of the key differences between organic and conventional foods are:

- Chemical fertilizers have been used on most conventional foods to promote plant growth, while organics use only natural fertilizers like manure or compost.

- Conventional foods are sprayed with synthetic insecticides, but organic foods use natural methods including beneficial insects and birds, mating disruption or traps.

- Conventional produce uses herbicides to manage weeds while organics use environmentally-generated plant killing compounds, crop rotation, tilling, hand weeding or mulch to control weeds.

- Conventional livestock receive antibiotics, growth hormones and medications to prevent disease and spur growth, but organics receive organic feed and access to the outdoors while using preventable measures to help minimize disease.

Both methods end up with a product to sell and eat, but organics do so using what is in nature as opposed to chemicals and medicines like conventional. As redOrbit showed, the nutritional value—as in what nutrients we gain—of each is about equal, but there are other benefits of organic food.

Helpguide.org, in collaboration with Harvard Health Publications, explains several of these benefits.
- Organic produce contains fewer pesticides. Pesticides are chemicals such as fungicides, herbicides, and insecticides. These chemicals are widely used in conventional agriculture and residues remain on (and in) the food we eat.

- Organic food is often fresher. Fresh food tastes better. Organic food is usually fresher when eaten because it doesn’t contain preservatives that make it last longer. Organic produce is often (but not always) produced on smaller farms near where it is sold.

- Organic farming is better for the environment. Organic farming practices reduce pollution (air, water and soil), conserve water, reduce soil erosion, increase soil fertility, and use less energy. In addition, organic farming is better for birds and small animals as chemical pesticides can make it harder for creatures to reproduce and can even kill them. Farming without pesticides is also safer for the workers who harvest our food.

- Organically raised animals are NOT given antibiotics, growth hormones, or fed animal byproducts. The use of antibiotics in conventional meat production helps create antibiotic-resistant strains of bacteria. This means that when someone gets sick from these strains they will be less responsive to antibiotic treatment. Not feeding animal byproducts to other animals reduces the risk of mad cow disease (BSE). In addition, the animals are given more space to move around and access to the outdoors, both of which help to keep the animals healthy. The more crowded the conditions, the more likely an animal is to get sick.

In closing, when it comes to organic food, it’s often more about what they don’t have than what they do have. Although the benefits of organic food may or may not include higher amounts of vitamins and minerals, they do provide a food product with less toxins and promote fresher foods.

Each of the benefits discussed above help make a case for eating organic. However, conventional foods have their own set of benefits, the foremost of which is simply that they are more affordable. Whether one chooses conventional foods or organic foods, it is important to know the difference and understand what it is we are eating. If we are going to be healthy eaters, we must also be informed eaters. We should know the benefits of organic foods.

Source: Rayshell Clapper for redOrbit.com - Your Universe Online

Tuesday, 6 August 2013

చిరస్మరణీయుడు మన జయశంకర్ సార్


‘‘పుట్టుక నీది
చావు నీది
బతుకంతా దేశానిది’’
కాళోజీ మాటలు ఇటీవలి కాలంలో సరిగ్గా వర్తించేది మన తెలంగాణలో జయశంకర్ సార్‌కే. అవును మరి. మనందరిని ఏకైక స్వప్నానికి చేరువ చేసిన దీర్ఘదర్శి ఆయన. తెలంగాణ సాధన ఆవశ్యకతను మొదట్నుంచీ నినదించిన నిఖార్సయిన తెలంగాణ వాది... రాష్ట్ర విభజన సందర్భంలో తొలుత యాది ఆయన్నే. ఆగష్టు 6న వారి 79వ జయంతి సందర్భంగా ‘బతుకమ్మ’ నీరాజనం. 


ఒక విద్యార్థిగా, టీచర్‌గా, వైస్ ప్రిన్సిపాల్‌గా, వైస్ ఛాన్సలర్‌గా పనిచేస్తూనే తెలంగాణ రణన్నినాదాన్ని వినిపించిన పోరాటశీలి ఆయన. ఉద్యోగ విరమణానంతరం పూర్తికాలం తెలంగాణ కార్యకర్తగా పనిచేసి, మనదైన ఒక స్వీయ రాజకీయ అస్తిత్వానికి మనల్ని చేరువ చేశారాయన. రచనలు, ప్రసంగాలు, పరిశోధన- తెలంగాణ సాధనలో క్రియాశీలంగా ఉండే వ్యక్తులతో లోతైన చర్చలు జరపడం- ఇట్లా ఇవ్వాళ్టి కీలక సందర్భానికి భూమికను అందించిన తొలి ఉపాధ్యాయుడు జయశంకర్ సార్.

1934 ఆగష్టు 6న హనుమకొండలో జన్మించిన జయశంకర్ సార్ 1952 నుంచి సాగుతున్న ఉద్యమం మూడు దశలకు సాక్షి. అప్పట్నుంచీ తుదిశ్వాస విడిచేదాకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం అన్నదే ఆయన ఏకైక ఎజెండా. తన ‘ఇంవూటస్ట్’ అంతవరకే అని ఆయనే అన్నారు. ఆ ఘడియ చివరి దాకా ఉండి వెళ్లిపోయారు. ఆయన అన్నట్టే తెలంగాణ పునర్నిర్మాణం అన్నదాంతో నిమిత్తం లేకుండా గనుక మాట్లాడుకుంటే, రాష్ట్ర ఏర్పాటు జరిగీ జరగగానే, పొడిచే ప్రతి పొద్దునా, ఆయనే ప్రాతఃస్మరణీయుడు.

ఒక విద్యార్థిగా 1952లో నాన్‌ముల్కీ ఉద్యమంలోకి ఉరికిండు. 54లో ఫజల్ అలీ కమీషన్‌ను కలిసిండు. 1968-71 ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిండు. 1996 నుంచి మళ్లీ మలి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నడు.
నిజానికి తెలంగాణ అనేక రకాల ప్రయోగశాల. ఇక్కడ జరగని ఉద్యమం లేదు. కానీ, తెలంగాణ ఒక తేల్చవలసిన అంశంగా మారడానికి కావలసిన భావజాల వ్యాప్తిలో ముందుండి, మరెందరికో స్ఫూర్తినిచ్చింది జయశంకర్ సారే. ఒక వ్యక్తిగా మనసా వాచా కర్మణా తెలంగాణే సర్వస్వంగా జీవించిన వ్యక్తి మరొకరు లేరు. తెలంగాణ ఉద్యమమే ప్రధాన ఇరుసుగా అన్ని శక్తులూ కదిలేలా వ్యవహరించిన ఛోదక శక్తి జయశంకర్ సార్.

నిజానికి విప్లవోద్యమం వల్ల సామాజిక అవగాహన పెంచుకుని, చైతన్యవంతమైన వాళ్లలో జయశంకర్ సార్ కూడా ఒకరు. అయితే, తక్షణ లక్ష్యం అయిన, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ‘భౌగోళిక తెలంగాణ’ సాధనకు పరిమితులతో కూడిన కార్యాచరణ అవసరం అని గ్రహించిన వాళ్లలో ఆయనే ముఖ్యులు. పార్లమెంటరీ, ఉదారవాద రాజకీయాలు కూడా తెలంగాణ సాధనలో కీలకమని గుర్తించి, ఆ దిశగా ఎవరేమన్నా పట్టించుకోకుండా సానుకూల రాజకీయ ప్రక్రియ ఆవశ్యకతను గుర్తించి పనిచేశారు. ‘గమ్యాన్ని ముద్దాడేదాకా ఉద్యమాన్ని వీడేది లేదని కేసీఆర్ వంటివారు ఆత్మస్థయిర్యంతో చెప్పడానికి కావలసిన ప్రాతిపదికను సైద్ధాంతికంగా సమకూర్చింది ఆయనే.

‘‘అయితే నేను సిద్ధాంతకర్తని కాను. అలా అనుకోను. ఇంగ్లీషులో ‘ఐడియలాగ్’ అనే మాట పత్రికలు వాడేవి. తెలుగు అనువాదంగా పత్రికలూ అలాగే వాడాయి. అట్లా నేను సిద్దాంతవేత్తని అయ్యానుగానీ నేను అలా అనుకోను. చివరకు నన్ను ‘టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త’ను అని కూడా అన్నారు.. అది కూడా కాదు. నేను విశ్వసనీయత ఉన్నంతవరకూ, తెలంగాణ సాధనకు ఎవరు పనిచేసినా వారితో ఉన్నాను. నేను సిద్ధాంతకర్తను కాను, కార్యకర్తను, స్వచ్ఛంద కార్యకర్తను’’. (‘వొడవని ముచ్చట’ నుంచి...)

అదీ ఆయన నిజాయితీ, వినవూమత. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన ఒక నమ్మకస్తుడైన, ప్రజలకు విధేయుడైన కార్యకర్త. అట్లే బతికాడు. అట్లే మనపై చెరగని ముద్ర వేసి పోయాడు. కానీ, ఆయన నాయకత్వ ప్రతిభ అబ్బురపర్చే అంశం. చూస్తుండగానే మొత్తం సమాజాన్నే ఆయన కార్యోన్ముఖులను చేసారు.

ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం, మృదుభాషణం, తొణకని వ్యక్తిత్వం, ఉద్యమ ఒడిదుడుకులకు లోనైతే భావోద్వేగాలకు లోనుకాని స్థితవూపజ్ఞత, వెరసి జయశంకర్ సార్. ఈ ఉదాత్త వ్యక్తిత్వమే ఆయన్ని తెలంగాణ వాదిగా చివరి వరకూ నిలిపింది.

అయితే, ఈ వ్యక్తిత్వం అన్నది పాదుకొనడం వెనుక చరిత్ర ఉన్నది. అది కొత్తగా చెప్పవలసినది కాదు. ఎంతో వివక్ష, మరెన్నో చేదు అనుభవాలు ఆయన్ని తెలంగాణ వాదిగా మలిచాయి. దానికి తోడు ఆయన వెనుకబడిన కులంలో పుట్టడం, వరంగల్‌లో జన్మించడం, ఆర్థిక శాస్త్రాన్ని చదువుకోవడం, వ్యక్తిగత జీవితం అన్నది లేకుండా అవివాహితుడిగా జీవించడం, బోధనా రంగంలోనే జీవిత కాలం కృషి సల్పడం, విప్లవ రాజకీయాల చైతన్యాన్ని అందిపుచ్చుకోవడం, అదే సమయంలో మన సంస్కృతిని నిలు కాపాడుకోవడం, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్- ఈ మూడు భాషల్లో ప్రవీణులై ఉండి, గొప్పగా కమ్యూనికేట్ చేయగలగడం, సరళ సుబోధకంగా కలం పట్టి రాయగలగడం, వీటన్నిటివల్లా ఆయన ఎంచుకున్న కార్యశీలత వన్నెతేలింది. వెరసి ఆయనకు మరింత వినయం, విధేయతా అబ్బాయి. నేను ‘కార్యకర్తను’ అనేంత గొప్పవాణ్ణి చేశాయి.

తన జీవితంలో ఆయన అనేక ప్రశ్నలు వేశాడు. వేయవలసి వాళ్లకే వేశాడు. గణాంకాలతో సహా జవాబులూ చెప్పాడు. ముఖ్యంగా చంద్రబాబును ప్రశ్నించాడు. ఆయన చేసిన అభివృద్ధి వల్ల ఆంప...అలాగే తెలంగాణ కూడా ‘టేకాఫ్’ అవుతున్నాయంటే, ‘టేకాఫ్’ అంటే పైకెగరడం కదా...కానీ జరుగుతున్నది అది కాదు, ‘మునుగుతున్నది’...అని గట్టిగానే చెప్పాడు. ‘నేనూ ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేశాను. మీ ప్రభుత్వ లెక్కలే ఆ సంగతిని ధృవపరుస్తాయి’ అని మరుసటి రోజే బాబుకు వివరంగా రాశాడు. అలా, తాను ఎవరైతే తెలంగాణను ఒక ‘సమస్య’ అనుకుంటారో వాళ్లకు దాని లోతుపాతులను సులభంగా అర్థమయ్యేలా చెప్పాడు. ‘దగాపడ్డ తెలంగాణ’ గురించి రాయడం మొదపూట్టాడు.

మల్లేపల్లి లక్ష్మయ్య ‘తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్’ పేరిట 1997లో ప్రచురించిన సార్ ప్రసంగ పాఠం మెలమెల్లగా యావత్ తెలంగాణకు ఒక కరదీపికే అయింది. అనతికాలంలో ఒక ఆయుధంగా మారింది. ఈ పుస్తకాన్ని తెలంగాణ వాళ్లే కాదు, ఆంధ్రవాళ్లూ చదివి వాస్తవాలు గ్రహించే సౌలభ్యమూ జరిగింది. అయితే, 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ తర్వాత ఈ డిమాండ్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గిందనే వాదనను ముందుకు తెచ్చింది. అప్పటికే రెండు మూడు ముద్రణలు పొందిన ఈ పుస్తకాన్ని మళ్లీ ఈ తరుణంలో పునర్ముద్రించారు. అలా, జయశంకర్ సార్ ఉద్యమ పితామహులుగా పేరొందడానికి కారణం కార్యకర్తకు కావలసిన ప్రాతిపదికనే కాదు, కేసీఆర్ వంటి నేతలకు కావలసిన ఆత్మవిశ్వాసాన్నీ ప్రోది చేశారు. అందుకు అవసరమైన పరిశోధన అంతా కూడా గురుతర బాధ్యతగా తలమునకలై నిర్వహించారు. నిజానికి తెలంగాణ ఉద్యమ ‘పునరుద్ధరణ’ అని గనుక మనం మాట్లాడుకుంటే, దానికి ఆదినుంచీ జయశంకర్ సార్ ఉఛ్వాస నిశ్వాసాలుగానే ఉన్నారు.

1996 ఆగస్టు 15న ఆనాటి ప్రధాని దేవేగౌడ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ మూడు రాష్ట్రాల ఏర్పాటును ప్రకటించడం, ఆ ఒక్కమాట తెలంగాణ వాదులను తట్టిలేపడం, దాని ఫలితమే అక్టోబర్ 27న నిజామాబాద్‌లో కొందరు సమావేశం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత నవంబర్ 1న వరంగల్‌లో విద్రోహదినం పేరిట సభ ఏర్పాటు...దానికి ఐదువేల మంది జనం వచ్చారట...అక్కడ్నుంచీ మళ్లీ తెలంగాణ వాదన అన్నది మరింత స్థిరంగా, నిరాటంకంగా మొదలై తెలంగాణ ఉద్యమ పునరుద్ధరణకు అంకురం వేసినట్టే అయింది. అయితే నాటి వరంగల్ సభ జరిగిన మరునాడే చంద్రబాబు, ‘వేర్పాటు వాదాన్ని సహించను. ఉక్కుపాదంతో అణచివేస్తాను’ అంటే, ఆ సభ అనంతరం అనేక సమావేశాలు, సభలు జరిగాయి. ఇలా తాను ఆరంభించిన అగ్నికి చంద్రబాబే అజ్యం అవగా, ఆ వేడిని చల్లారకుండా కొనసాగేలా చేసిన వాళ్లలో జయశంకర్ సార్ కీలకం.

ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు, ఉద్యోగంలో చేరడానికి వచ్చినప్పుడు మొదలైన వివక్ష, తర్వాత్తర్వాత పెరిగింది. దాంతో పాటు ఆయనలోనూ తెలంగాణ వాది ఎదిగాడు. అయితే, 1996 తర్వాత జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో పూర్తికాలం నిమగ్నమయ్యారు. 2001 దాకా అనేక వేదికలతో కలిసి పనిచేశారు. ముఖ్యంగా 1996-97లో తెలంగాణ భావజాల వ్యాప్తి విషయంలో నాన్ పొలిటికల్ గ్రూప్‌గా, అకాడమీషియన్స్‌తో కలిసి చాలా చేశారు. అనేక సమావేశాల్లో ప్రసంగిస్తూ, రచనలు చేస్తూ కీలకంగా ఉన్నారు. 1998-99లో అమెరికాలో కూడా తెలంగాణ యాక్టివిటీ పెరగడంతో అక్కడికీ వెళ్లారు. పది పట్టణాల్లో సమావేశాలు పెట్టారు. ఆయన స్ఫూర్తి ‘తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఏర్పాటుకూ మార్గం వేసింది. తర్వాత 2000 సంవత్సరంలో కాంగ్రెస్ వాళ్లు ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసుకుంటే ఆయన్ను ఎమ్మెల్యేలు వాళ్ల తరఫున పిలిపించుకుని తెలంగాణ వాదన వినిపించేలా చేసుకున్నరు. రెండున్నర గంటల సేపు ఆయన అధికారికంగా వాదించారు. తర్వాతే కేసీఆర్ జయశంకర్ సార్‌ను కలిశారు. అలా చెన్నాడ్డి మొదలు కేసీఆర్ దాకా...తనను అడిగిన వాళ్లకు తన వంతు సహకారం అందించారు. అవసరమైన చోటల్లా కార్యకర్తగా కృషి చేశారు.

టీఆర్‌ఎస్ వచ్చేదాకా ఒక బలమైన నిర్మాణంతో కూడిన పార్టీ అన్నది లేదు. అది వచ్చాక ఆయన కృషికి మరింత బలం చేకూరింది. అయితే ఆయన ఎన్నడూ ఏ పార్టీలోనూ చేరలేదు. టీఆర్‌ఎస్‌లోనూ సభ్యుడిగా చేరలేదు. ఎందుకంటే తానే అన్నట్టు తన పర్పస్ తెలంగాణ సాధనే. పదవులూ, హోదాలు, లబ్ధి పొందడమూ కాదు. చివరకు ఆయనపై ‘తెలంగాణ సిద్ధాంతకర్త’ అన్న పేరు నుంచి ‘టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త’ అన్న అపవాదు వచ్చినా తన పని మానలేదు. ‘కొందరు అన్నరు, నువ్వు టీఆర్‌ఎస్ లోపల్నుంచి బయటకు రావాలె’ అని! ‘నేను ఎప్పుడు లోపలున్న’ అని నవ్వుతారాయన.

అయితే, ఆయన తాను నమ్మింది ఆచరించాడు. తప్పులు చేస్తున్నావని ఎవరైనా అంటే, ‘మీరు అది కూడా చేయడం లేదు కదా’ అని నోరు మూయించారు. అంతేకాదు, ఆయన చాలా విస్పష్టంగా చెప్పారు, తనను విమర్శించే వాళ్లను కూడా తాను పల్లెత్తు మాట అనలేదని! ‘‘ఎందుకు విమర్శ చేయనంటే...వాటీజ్ ది పర్పస్? ఎవరికి దోచింది వాళ్లు జేస్తరు. కాలం నిర్ణయిస్తంది. ఎవరి పాత్ర ఏంది అన్నది కాలం నిర్ణయిస్తది.’’ ముందే చెప్పినట్టు, తెలంగాణ సాకారం అయిందీ అంటే అదే ఆ ‘కాలం.’ తెలంగాణ సాకారం కావడమే సిసలైన కాల పరీక్ష. అది సాధ్యమైందీ అంటే జయశంకర్ సార్ పూర్తిగా నెగ్గినట్టే. ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్న సమయంలో జయశంకర్ సార్ గురించిన వ్యాసం అందుకే.

ప్రతి ఒక్కరికీ తెలుసు. తెలంగాణ సాధన అవసరమని. కానీ, పట్టువిడుపులతో ఒక రాజకీయ ప్రక్రియగా తెలంగాణ మారడానికి ఇతోధికంగా కృషి చేసిన వారిలో జయశంకర్ సార్ అద్వితీయులు. అణువణువునా వలసాంధ్ర ఆధిపత్యం అవరించిన వేళ ఆయన బుద్ధిజీవిగా వారి వాదనల్ని ఓడించారు. కానీ, తన శరీరాన్ని కబళించిన క్యాన్సర్ ముందు ఆయన ఓడిపోయారు.  తెలంగాణ సాకారం కాకముందే, 21 జూన్ 2011న ఆయన మనల్ని వీడి వెళ్లిపోయారు. కానీ ఆయన చిరస్మరణీయులు. వారిని తెలంగాణ సమాజం ఎల్లవేళలా గుర్తు పెట్టుకుంటుంది. ఎందుకంటే, ఏ పార్టీలోనూ ఆయన సభ్యుడు కాదు. కానీ, తెలంగాణ సభ్య సమాజమే ఒక పార్టీగా భావించి తెలంగాణ సమస్యపై కలసి వచ్చే ప్రతి ఒక్కరితో ఆయన కలిసి పని చేశాడు. ఇది ఆయన వ్యక్తిత్వంలో ఒక ఆశ్చర్యకరమైన అంశం. అదే విషయాన్ని ఆయన మాటల్లో చెబితే, ‘పర్పస్’.

తెలంగాణ మాత్రమే ఆయన ‘పర్పస్’గా ఉండేది. వ్యక్తులు, సంస్థలు, పార్టీలు సెకండరీగా ఉండేవి. ‘‘యాభై ఏళ్లుగా చూశాను. ఒక దగ్గరి దాకా వచ్చి ఆగిపోతున్నాం. కాబట్టి రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ సాధ్యం అని నమ్మాను. కేసీఆర్‌తోనూ అసోసియేట్ అయ్యాను. నిజమే మరి. ఆయన ఉద్యమాన్ని పదేళ్లకు పైగా నిలడకగా ఉంచాడు కదా....ఇది గతంలో ఇంత స్థాయికి తెచ్చింది మరొకరు లేరు. అందుకే, నేను కేసీఆర్ పట్ల బాగా ఇంప్రెస్ అయ్యానని’ ఆయనే చెప్పారు. ఆయన ఇంప్రెషన్ కరెక్టే అయింది. ఒక రాజకీయ శక్తిగా ఇవ్వాళ అందరూ గుమిగూడి కాంగ్రెస్‌ను డిమాండ్ చేసే స్థాయికి వచ్చామంటే ఇలాంటి కార్యశీలత వల్లే. ఆ లెక్కన..మొత్తం సమాజం తన గమ్యాన్ని ముద్దాడేందుకు అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడేదాకా నిశ్శబ్దంగా కృషి చేసిన మేధావి జయశంకర్ సార్. ఆయన్ని రాబోవు తరాలు ‘జాతిపిత’గా గుర్తుపెట్టుకుంటాయా, ‘సిద్ధాంతకర్త’గా కొనియాడుతాయా, పునర్నిర్మాణంలో ఆయన ఆశయాలను పట్టించుకుంటాయా లేదా అన్నది వేరే విషయం. ఇవ్వాళ్టికివ్వాళ తెలంగాణ సాధన సఫలమైతే గనుక ఈ భౌగోళిక తెలంగాణకు ముగ్గువోసిన నిండు మనిషి, వ్యూహకర్తా జయశంకర్ సారే అవుతాడు. ఆ దిశగా ఆయన జరిపిన కృషి, వహించిన గురుతర బాధ్యత, అనుసరించిన జీవన విధానమూ, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవలసే ఉంది.
అన్నట్టు, తెలంగాణ ఉద్యమంలో కళా రూపాల డైమన్షన్‌ను అర్థం చేసుకున్న కొద్దిమందిలో జయశంకర్ సార్ ఒకరు. ‘తెలంగాణ ఉద్యమం మలిదశలో వచ్చినటువంటి కొత్త పార్శం ఏమిటంటే ఇది సాంస్కృతిక పునరుజ్జీవనం. తాను ఒక కార్యకర్తగా యాభై ఏళ్లుగా చేసింది, ఇప్పుడు కవులు, కళాకారులు, రచయితలు చేస్తుండటం ఆయనకు సంతోషాన్ని కలిగించింది. మలిదశలో వచ్చిన ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారణం మన భాషను, యాసను, నుడికారాన్ని, కట్టును, బొట్టును చిన్న బుచ్చటమే అని., ఒక గొంతుక అనేక గొంతులుగా మారడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిండు.

వై.ఎస్. మరణించినప్పుడు ఆయన నిర్మొహమాటంగా ‘ఒక ప్రధాన అడ్డంకి తొలగిపోయింది’ అని అన్నారు. సార్ స్పీచ్ అనంతరం, అదే వేదికపై ఉన్న ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, ‘ఏ సందర్భంలో ఏం మాట్లాడాలీ అన్నది ఒక సిలబస్‌లా కూడా జయశంకర్ సార్ అందించేవాడని’ అన్నారు. ఇట్లా అనేక కీలక, సున్నితమైన సందర్భాల్లో జయశంకర్ సార్ తెలంగాణ వాణిని వినిపించేవారు. మలితరం కార్యకర్తలు, బుద్ధిజీవులకు స్ఫూర్తినిచ్చారు.
అయితే, ఆయన వ్యక్తిత్వం సన్నిహితంగా చూసిన ఎందర్నో ఆకర్షించింది. ముఖ్యంగా మన యువత ఆయన్ని బాగానే అర్థం చేసుకున్నది. తెలంగాణ జాగృతి కార్యకర్త నవీన్ ఆచారి అంటాడు, ‘‘జయశంకర్ సార్‌లో మూడు పార్శ్వాలు మమ్మల్ని ఎల్లవేళలా ప్రభావితం చేస్తాయి. ఒకటి, ఆయన మన కాలంలో ఒక కీలకమైన అంశానికి సంపూర్ణంగా అంకితమైన తెలంగాణ వాది. రెండు, ఆయన తెలంగాణ సమస్యల్ని అరటిపండు ఒలిచి చెప్పినట్లు విడమర్చి చెప్పే మహోపాధ్యాయుడు. మూడు, వ్యక్తిగతంగా కూడా మచ్చలేని తనం’’

నిజమే. విప్లవ రాజకీయాలను ఎంతగా ప్రేమించే వారైనా శ్రీశ్రీ వ్యక్తిగత జీవితాన్ని అయిష్టపడి ఆయనలోని రాజకీయ కోణాన్ని మాత్రం అభిమానిస్తారు. కానీ, తెలంగాణలో జయశంకర్ సార్‌ది ఏ విధంగానూ మచ్చలేని వ్యక్తిత్వం. అందుకే ఒక నిండు మనిషిగా చెరగని ముద్ర వేసిన జయశంకర్ సార్ తెలంగాణ తత్వానికి నిదర్శనం. యువతకు ఆదర్శనీయం.

చివరి రోజుల్లో ఆయన సంతృప్తిగానే ఉన్నారు. ‘‘ఇప్పుడు కంప్లీట్‌గా సొసైటీ మొత్తం వర్టికల్‌గా డివైడ్ అయ్యున్నది. ప్రజల్లోకి బోయింది. ఈ దశ నాకు నా యాభై, అరవై ఏండ్ల అనుభవంలో కూడా లేకుండె. ఇపుడు చాలా తృప్తికరమైన స్టేజి కొచ్చింది. తిరుగులేని స్టేజి కొచ్చినం. ఇపుడు వెనక్కి బోదు. దీన్ని ఎవరూ ఆపలేరు. దటీజ్ ఎ వెరీ డిజైరస్ స్టేజ్ ఇన్ ది మూమెంట్. ఇపుడు నాకు పని లేకుండా జేసిండ్రు అని జెప్తున్న...’’ అని సంతృప్తితో ఆయన అన్నారు కూడా (వినండి: ఒడవని ముచ్చట...ఆడియో)

చివరగా ఒక్క విషయం. తెలంగాణ ఏర్పాటుతో ‘ట్రెమండస్ ఛేంజెస్ ఉంటయి. ఆర్థిక పునర్నిర్మాణంలో బలహీన వర్గాల పాత్ర పెద్దగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ‘ఏది ఏమైనా తెలంగాణ సెంట్రిక్‌గా డెవలప్‌మెంట్ ఉంటది’ అన్నారాయన. ‘సామాజిక న్యాయం. నా కాన్పెస్ట్ అదే’ .. అని కూడా చెప్పారాయన. అయితే, ‘తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటా? టిఆర్‌ఎస్ గవర్నమెంటా అన్నది నాకు ముఖ్యం గాదు. సరకు అదే గదనయ్యా.. సరకు అదే గదా! ఎట్ల పనిజేస్తరన్నది ముఖ్యం’’ అని చెప్పారు.

దీన్నిబట్టి ఒక విషయం స్పష్టం. ఆయన ఒక భూమిపుత్రుడిగా, నిజ కార్యకర్తగా తెలంగాణ తల్లికి చేయవలసింది చేశారు. ఇక మిగిలింది మన పనే!

Sunday, 4 August 2013


Saturday, 3 August 2013

Creation of a new state holds many opportunities for Telangana and Seemandhra

The decision of the UPA and the Congress Working Committee to accede to the long-standing demand for a separate Telangana state from Andhra Pradesh ends uncertainty holding up development and opens up opportunities for harmonious and inclusive development of both states.

But it is necessary to avoid short-term and sectarian considerations while drawing up their boundaries to exploit the long-term opportunities for development provided by the need for building the new capital of Andhra Pradesh.

The idea of including two districts of Rayalaseema, Kurnool and Anantapur in Telangana is apparently kept open, however slender may be the chances for such a proposal. Like Telangana, Rayalaseema acquired a distinct regional identity of its own because of agro-climatic, historical and political factors. Therefore, any attempt to divide it is bound to meet stiff resistance from the people of Rayalaseema.

Don't Split Rayalaseema

Notwithstanding its enterprising elite, Rayalaseema is the most backward region in the present state. Its development requires a concerted plan for the whole of this homogeneous region as well as the necessary institutional arrangements and political clout that are possible only when the four districts of the region are together in one state.

One hopes that short-term political advantages arising from the demographics of religion and caste (See The Contested Ideas of Rayala Telangana, ET, July 30) will not be allowed to favour a decision that could hamper the development of this backward region and, indeed, of both the new states. An issue of concern following the creation of Telangana state is the possible impact on Seemandhra's economy after its separation from Hyderabad.

Another is the prospects for education and employment for Seemandhra youth in Hyderabad and security of investments, properties, jobs and livelihoods of those from Seemandhra settled in Hyderabad and other districts of Telangana.

Little Economic Impact

In the current phase of globalisation, the character of Hyderabad underwent a major change with its phenomenal growth and increased links with the national and global economy that, as brought out by the Srikrishna Committee on Andhra Pradesh, now predominate over its links with the state economy. A striking feature brought out by the committee is the concentration of IT and ITeS almost solely in Hyderabad accounting for 99% of these exports from the state.

But, of the 94 groups identified separately for investments in Hyderabad and adjoining Ranga Reddy districts, as many as 74 are from outside Andhra Pradesh. Even in construction and real estate, finance and business services, private Andhra-based investors are not dominant. The committee's narrative of key cities in Andhra suggests that the economic interdependence between them may be limited. Hyderabad and each urban centre in coastal Andhra and Rayalaseema have their own economic hinterland and growth drivers.

While Hyderabad is much larger than other cities in the state, the latter are not solely dependent on Hyderabad for market linkages and other services. Thus, the adverse impact, if any, on the economy of Seemandhra on account of separation of Telangana with Hyderabad as its capital is not going to be significant.

The Promise of Growth

The second issue is the protection of the interests of Seemandhra migrants, especially youth, for education and employment in Hyderabad. The proposed measures to protect such interests could be similar to the decision to retain Hyderabad as the joint capital for 10 years. In any case, the issue would call for a dialogue between leaders across regions with a spirit of accommodation.

Construction of a new world-class capital for Seemandhra holds the greatest promise, among other things, for easing pressure on education and employment of the youth. India is on the threshold of rapid urbanisation. Construction of a new capital for Andhra could be a major source for reviving growth and increasing employment. It also provides an opportunity for constructing an eco-friendly, energy-efficient and slum-free city with public transport and safeguards for easy mobility for pedestrians.

Would the people of Telangana be hostile to the businesses in Hyderabad owned by people from coastal Andhra? Several business persons in Hyderabad hailing from Andhra interviewed immediately after the decision to bifurcate the state reportedly expressed relief over the ending of "uncertainty". Hardly any apprehensions were ventilated. The current regional conflicts relate to the distribution of benefits from public investment and employment.

Private enterprise was unaffected by separatist agitations. Conflicts of interest arise when state power is used by the politico-business elite from the Andhra region to deny alevel playing field to commerce and industry in Telangana.
--
Prof C H Hanumantha Rao
The writer is Chancellor, University of Hyderabad, and Honorary Professor, Centre for Economic & Social Studies

Thursday, 1 August 2013

కేసీఆర్ ఏం చేశారు ? -- కట్టా శేఖర్ రెడ్డి


 
• సమైక్యవాదులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు అనునిత్యం కేసీఆర్ను ఆడిపోసుకుంటుంటారు.
• టిజి వెంక సాకే శైలజానాథ్లూ కేసీఆర్నే దుయ్యబడుతుంటారు.
• దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్లూ కేసీఆర్నే విమర్శిస్తుంటారు.
• తెలంగాణ బిడ్డలు మోత్కుపల్లి, ఎర్రబెల్లి కూడా కేసీఆర్పైనే ఒంటికాలుమీద లేస్తుంటారు.
• తెలంగాణకోసం ఉద్యమాలు చేస్తున్నామని చెప్పే కొన్ని సంఘాలవాళ్లూ కేసీఆర్పైనే దాడి చేస్తుంటారు.
• తెలంగాణకు హక్కుదారులుగా చెప్పుకునే డికె అరుణ, రేణుకాచౌదరి వంటి వాళ్లూ కేసీఆర్పైనే విసుర్లు ఎక్కుపెడుతుంటారు.

ఎందుకిలా జరుగుతోంది?

వేర్వేరు పార్టీలు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన అంద రి ఉమ్మడి లక్ష్యం కేసీఆర్ ఒక్కరే కావడంలోని అంతరార్థం ఏమిటి? ఇంతమందికి కేసీఆర్ శత్రువు ఎందుకయ్యారు?
కేసీఆర్ నిజంగా ఇటువంటి విమర్శలకు పాత్రుడేనా?
ఇంతమంది దీవెనలతో కేసీఆర్ బలపడుతున్నారా? బలహీనపడుతున్నారా?
తెలంగాణ ఆకాంక్షలకు కేంద్రబిందువు కావడమే ఆయనను విమర్శలకు కేంద్రబిందువును చేసిందా?
ఇటీవల జరిగిన ఒక మిత్రగోష్టిలో సీమాంధ్ర ప్రాంతానికి చెంది న సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ కేసీఆర్పై చేసిన విశ్లేషణ ఈ సందర్భంగా గుర్తు చేయదల్చుకున్నాను. ఆయన రాష్ట్ర రాజకీయాలను గురించి, వివిధ పార్టీల అగ్రనేతలను గురించి వర్ణిస్తూ, ఇంతమంది విమర్శలకు కేసీఆర్ ఎందుకు కేంద్రబిందువు అయ్యాడో వివరించాడు.

‘‘కేసీఆర్ ఏం చేశాడని పదే పదే మాట్లాడతారు టీడీపీ వాళ్లు. కేసీఆర్ తెలంగాణ కు పది తరాలకు సరిపోను నాయకులను తయారు చేశారు. తెలంగాణ సమాజాన్ని ఒక అస్తిత్వ కేతనంగా తీర్చిదిద్దారు. మా(సీమాంధ్ర) నాయకులూ ఉన్నారు. ఒక్కడు అరగంట కూడా సరిగా మాట్లాడలేడు. చాలా మందికి నోరే పెగలదు. అసలు మా నాయకులు రెండో తరం నాయకులను తయారు చేయరు సరికదా, ఉన్నవారిని ఎదగనీయరు. కానీ కేసీఆర్ ఊరూరా వేలాదిమంది ఉపన్యాసకులను, ఉద్యమకారులను తయారు చేశారు. ఒక సామాన్య గ్రామీణ కార్యకర్త, ఒక మామూలు యూనివర్సిటీ విద్యార్థి, ఒక పణికెర మల్లయ్య కూడా ఇవ్వాళ తెలంగాణపై గణగణా గంటసేపు మాట్లాడగలరు. చంద్రబాబు వంటి వారిని పొలంగట్టుపై నిలదీసి అడగగలరు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, అస్తిత్వకాంక్షల స్పృహను సార్వజనికం చేయడమే కాదు, తెలంగాణ పేరెత్తకుండా ఇవ్వాళ ఏ నాయకుడూ మనలేని పరిస్థితిని తీసుకొచ్చారు. ఒక జాతి నిర్మాణానికి ఇంతకంటే ఏం కావాలి? సమకాలీన రాజకీయ చరివూతలో ఇంతటి కృషి, ఇంతటి ప్రభావం కలిగించిన నాయకుడిని చూపించండి? ఆయనకొక నినాదం ఉంది. తెలంగాణ నినాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, వరంగ ల్ నుంచి వాషింగ్టన్ దాకా విస్తరింపజేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనను ఇంటింటి నినాదంగా మార్చారు. మా నాయకులకు అసలు ఏ నినాదమూ లేదు. ఉన్నదంతా డొల్లతనమే. కేసీఆర్ పదకొండేళ్లు ఏ అధికారం లేకున్నా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పార్టీని, ఉద్యమాన్ని పట్టు సడలకుండానడుపుకుంటూ వస్తున్నారు. ఇటీవల మనం చూడడం లేదా-చంవూదబాబు ఏడేండ్లు అధికారం లేకపోయేసరికి విలవిల్లాడుతున్నారు. విచక్షణ, సోయి మరిచిపోయి మాట్లాడుతున్నాడు. ఏ లక్ష్యం, ఏ విధానమూ లేనప్పుడే ఇటువంటి అసహనం, దురావేశం వస్తాయి. కేసీఆర్కు ఒక విధా నం ఉంది. లక్ష్యం ఉంది. ఎవన్ని రకాలుగా ప్రచారం చేసినా, ఎన్ని అబద్ధాలను పత్రికల్లో కుమ్మరించినా తెలంగాణ కోసం మొక్కవోకుండా పోరాడున్నది ఒక్క కేసీఆరేనన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉంది. వరుస ఉప ఎన్నికలన్నీ అదే విషయం రుజువు చేశాయి. అది ఆయన సంపాదించిన విశ్వసనీయత. నాయకులు బలపడినా, బలహీనపడినా విశ్వసనీయతపై ఆధారపడే జరుగుతుంది. చంద్రబాబుకు లేనిది అదే. ఆయన ప్రజల విశ్వసనీయతను పదే పదే కోల్పోతూ వస్తున్నారు. మాటమీద నిలబడనితనం ఆయనను జనం నుంచి దూరం చేస్తున్నది’’ అని ఆయన వివరించారు.

‘‘తెలంగాణ విషయంలో చంద్రబాబు చేసింది పెద్ద తప్పు. ఆయన ఇప్పటికీ సరిదిద్దుకోకపోగా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. తనకెలాగూ విశ్వసనీయత లేదు కాబట్టి కేసీఆర్కు కూడా విశ్వసనీయత లేకుండా చేస్తే పోతుంది కదా అని ఆయన అనుకుంటున్నారు. చిన్న గీత పెద్దది కానప్పుడు, పెద్ద గీతను చెరిపేసి చిన్నదిగా చేయాలన్న కురుచబుద్ధి ఇది. అందుకే కేసీఆర్మీద, తెలంగాణ ఉద్యమం మీద మలినం కుమ్మరించడానికి, అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక మూకను అదేపనిగా ప్రయోగిస్తున్నాడు. చంద్రబాబు రాజకీయ విజ్ఞతపై కాకుండా ఇప్పటికీ, ట్రిక్కుల మీద, టక్కుటమార విద్యలమీద ఆధారపడుతున్నాడు. అది చంద్రబాబు ను ఇంకా డ్యామేజ్ చేస్తున్నది. మొన్నటి ఉప ఎన్నికల్లో నామినేషన్లు పూర్తయ్యే సమయానికి తెలుగుదేశం పరిస్థితి కొంత మెరుగుగా ఉండింది. అన్ని చోట్ల డిపాజిట్లు వస్తాయని సర్వేలు అంచనా వేశాయి. తెలుగుదేశానికి అన్ని నియోజకవర్గాల్లోనూ 1 నుంచి 25 శాతం ఓట్ల దాకా వస్తాయని సర్వేలు సూచించాయి. కానీ పోలింగ్ సమీపించే కొద్దీ చంద్రబాబుతోపాటు మోత్కుపల్లి, ఎర్రబెల్లి మరీ రెచ్చిపోయి మాట్లాడారు. పర్యవసానం ఏమంటే, మూడు చోట్ల డిపాజిట్లు పోయాయి. మిగిలి న మూడు చోట్ల ముందు ఊహించిన దానికంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కడియం శ్రీహరికి ఎర్రబెల్లి ప్రచారం మేలుకంటే కీడే ఎక్కువ చేసింది. తెలంగాణలోని ఇతర తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబు ప్రయోగించిన మూకను చూసి భయపడుతున్నారు. వాళ్లు వాగే కొద్దీ తాము మరింత ఇరుకున పడతామని భావిస్తున్నా రు’’ అని ఆయన విశ్లేషించారు.

‘‘ఎవన్ని చెప్పినా, తిట్టినా తెలంగాణవాదానికి ఇప్పటికీ చోదకుడు కేసీఆర్ ఒక్కరే. ఆయన వల్ల కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. కానీ తెలంగాణవాదాన్ని కేసీఆర్ ఎన్నడూ లెట్ డౌన్ చేయలేదు. మొదట చంద్రబాబు, ఆ తర్వాత రాజశేఖర్డ్డి, మళ్లీ చంద్రబాబు వంటివారు ఎన్నిసార్లు ఎన్ని ఎదురుదెబ్బలు, దొంగదెబ్బలు కొట్టినా ఆయన తెలంగాణ జెండాను మాత్రం కింద పడేయలేదు. కేసీఆర్ రాజకీయంగా బలపడేకొద్దీ తెలంగాణవాదం బలపడుతుంది. తెలంగాణవాదాన్ని కొట్టాలంటే కేసీఆర్ను కొట్టాలి. కేసీఆర్ను రాజకీయంగా బలహీనపర్చితే తెలంగాణవాదం బలహీనపడుతుంది. అందుకే తెలంగాణ వ్యతిరేకులకూ (సమైక్యవాదులకు), తెలంగాణ ద్రోహులకూ, తెలంగాణ రావడం కంటే రాజకీయంగా బతకడం ముఖ్యమ ని భావించే కొందరు తెలంగాణ మిత్రులకూ(?) ఉమ్మడి లక్ష్యం అయ్యారు కేసీఆర్. కేసీఆర్ను రాజకీయంగా ఫినిష్ చేస్తే తెలంగాణ కథ ముగిసిపోతుందని వారి ఆలోచన. కానీ కేసీఆర్ సక్సెస్ అయింది అక్కడే. ఆయన వందలాది మంది కేసీఆర్లను తయారు చేసి పల్లెపప్లూకూ వదిలారు. తెలంగాణ వ్యతిరేకులు, ద్రోహుల పాచికలు పారకుండా నిలువరించగలిగారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలాసార్లు ఆ విషయం రుజువు చేశారు. తెలంగాణవాదం ఇవ్వాళ ఈ ప్రాంత ప్రజల జీవనాడుల్లో ఇంకిపోయింది. తెలంగాణ తెచ్చిన వాళ్లను, ఇచ్చిన వాళ్లను మాత్రమే తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది. గోడమీది పిల్లులను, ఊసర గబ్బిలాలను ఇక్కడి ప్రజలు ఇంకేమాత్రం భరించే అవకాశం లేదు’ అని ఆయన అన్నారు.

‘మోత్కుపల్లి నరసింహులు ఆంధ్రా ప్రాంతంలో పెద్ద హీరో అయ్యారు’ అని ఒక రాజకీయ పరిశీలకుడు ఇటీవల ఒక సందర్భంలో చెప్పారు. ఈ మాట స్వయంగా నర్సింహులు కూడా కొంతకాలంగా చెబుతున్నారు. కేసీఆర్ను విమర్శించడం మొద లు పెట్టిన తర్వాత తనకు అనూహ్యంగా, అసాధారణంగా అభినందనలు వచ్చాయ ని చెప్పారు. ‘అభినందించేవాళ్లంతా ఎవరు?’ అని అడిగితే స్పష్టంగా సమాధానం చెప్పలేదు. కానీ కాసు బ్రహ్మనందాడ్డి పార్కులో మోత్కుపల్లి రోజూ ఉదయం వాకింగ్కు వస్తారు. అక్కడ ఆయనకు ఎదురుపడే వాళ్లంతా ఆయనను అహో! ఒహో! అని కీర్తించడం నాకు కూడా తెలుసు. కానీ వాళ్లంతా ఎవరు? సమైక్యవాదం సుభిక్షంగా ఇలాగే ఉండాలని కోరుకునే ఆంధ్రా ప్రాంతానికి చెందిన పారిక్షిశామిక, ఉద్యోగ, మేధావి వర్గాల కు చెందిన మిత్రులు. తెలంగాణ రావద్దని కోరుకుంటున్నవాళ్లు. తెలంగాణకు అడ్డంపడుతున్నవాళ్లు. ‘తెలంగాణ రాకపోయినా ఫర్వాలేదు, కానీ మా రాజకీయ ప్రాబల్యం తగ్గకూడద’నుకునేవాళ్లు. బయటివాళ్లు నిన్ను పొగడుతున్నారం నువ్వు ఇంటివాళ్లకు దూరమవుతున్నావని అర్థం. సమైక్యవాదులకు హీరోవయ్యావం తెలంగాణవాదులకు విలన్ వు అవుతున్నావని అర్థం. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న మోత్కుపల్లి నర్సింహులుకు ఈ లెక్కలన్నీ తెలియవని అనుకోలేం. కానీ ఆయన తెలంగాణవాదం నీడలో తనకు రాజకీయ అస్తిత్వం లేదనుకుంటున్నట్టున్నాడు. అందుకే క్యాలిక్యులేటెడ్ రిస్కుకు సిద్ధపడ్డాడు. ఈ పాత్రను స్వీకరించాడు.

చాలా ఏళ్ల కిందటి ముచ్చట. యూనివర్సిటీ లో స్టూడెంట్ యూనియన్ చైర్మన్కు పోటీ చేయాలని మా విద్యార్థి సంఘం అప్పట్లో నన్ను ఆదేశించింది. ‘నీకు విద్యార్థుల అందరి పేర్లు కంఠతా వచ్చు. నువ్వయితే గెలుస్తావ్’ అన్నారు. సరే అన్నాను. నాపై పోటీ చేయడానికి ఎవరూ ఉత్సా హం చూపించలేదు. ప్రత్యర్థులంతా చివరకు ఒక మిత్రుడిని ఒప్పించారు. ఆయన నామినేషన్ వేయగానే విద్యార్థినులంతా కట్టగట్టుకుని వచ్చా రు. ‘మీరు ఇక ప్రచారం చేయవలసిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండండి. ఆయనకు ఎంత గొప్ప పేరు ఉందో మీకు తెలుసు’ అని చెప్పిపోయారు. నిజంగానే ఎక్కువగా కష్టపడకుండానే ఎన్నికల్లో గెలిచాం. మా ప్యానెల్కు 1 ఓట్లు వస్తే, ప్రత్యర్థికి 92 ఓట్లు వచ్చాయి. మన సుగుణమే కాదు, ఎదుటివారి దుర్గుణా లూ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. కేసీఆర్ ఏ సుగుణాల కోసం, ఏ లక్ష్యాల కోసం నిలబడ్డాడు? చంద్రబాబునాయుడు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి, లగడపాటి, రాయపాటి... ఏ దుర్గుణాలను, ఏ అప్రతిష్ఠను మోస్తున్నారు? ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారు? ఈ సూకా్ష్మన్ని గ్రహిస్తే మంచిది. తెలంగాణ ప్రజలకు ఇవన్నీ ఇప్పటికే బాగా తెలుసు.
--
కట్టా శేఖర్ రెడ్డి
నమస్తే తెలంగాణ (CEO)

Wednesday, 10 July 2013

ఓరుగల్లు పొరుబిడ్డ


ఓరుగల్లు పోరుబిడ్డ ఒదిగిపోయెరా,
పోరులోన ఆశాజ్యోతి ఆరిపోయెరా! ॥ ఓరుగల్లు॥

కాకతీయ ప్రాంగణమ్ము కమిలిపోయెరా,
ఉస్మానియ పరిసరాలు ఉడికిపోయెరా! ॥ ఓరుగల్లు॥

మూడుతరాల ముద్దుబిడ్డ మునిగిపోయెరా,
కూలి, నాలి- బీదా,బిక్కి కుమిలిపోయెరా! ॥ ఓరుగల్లు॥

కొత్తపల్లి జయశంకర్ కొలిమి ఆయెరా,
ఎండుతున్న కడుపులల్ల మంట బెట్టెరా! ॥ ఓరుగల్లు॥

ఉడుకుతున్న ఉద్యమానికుప్పాయెనురా,
ఐక్యతనే ఆయుధంగ చేసి చూపెరా! ॥ ఓరుగల్లు॥

పొల్లుబోని మాటలింక మళ్లినలేమా,
నగుమోము నమ్మకము మేం గనలేమా! ॥ ఓరుగల్లు॥

ఆయుధాల అక్షరాలు చదువగలేమా,
కళ్లకు కట్టేటువంటి కవితలు రావా? ॥ ఓరుగల్లు॥

అరవయేండ్ల పోరు ఇంక అలసిపోయెరా,
ఆంధురోళ్ల కళ్లు ఇంక సల్లబడ్డయా? ॥ ఓరుగల్లు॥

జాతికొరకు జన్మనంత ధారపోసెరా,
తెలంగాణ బ్రహ్మగాను ఎదిగిపోయెరా! ॥ ఓరుగల్లు॥

విధిరాతను ఎదిరించలేక ఊపిరొదిపూరా,
ఆశయాల ఊపిరులు మనకు ఊదెరా! ॥ ఓరుగల్లు॥

Solar Energy an Economical Alternative to Conventional Power Supply


Rising energy prices and growing environmental concerns are making solar electric systems more attractive to homeowners. A solar electric system reduces high energy costs and keeps your home up and running during power outages. The current brief article to show cases the advantages of using solar power as an alternative and indeed renewable resource in the long run. Most solar electric systems last 25 years (typical life span of solar panels and sometimes even beyond) and pay for themselves in 4 to 5 years after tax credits and subsidies. That means homeowners or commercial entities can enjoy free electricity for years. If we install batteries to back up your solar electric system, it will provide power for 1-2 days (depending on the capacity of batteries) during cloudy/stormy weather conditions.

As a part of National Action Plan on Climate Change, Government of India launched Jawaharlal Nehru National Solar Mission (JNNSM) in 2009 to promote the development and use of solar energy for power generation and other uses with the ultimate objective of making solar energy competitive with fossil-based energy options. Despite this, widespread installation of solar PV systems to generate electricity on urban rooftops does not seem like a reality due to lack of appropriate knowledge.

Typical costs associated with a 5 KW solar roof top plant that can generate 8000 units per year (675 units per month) are shown in figure 1 (in the pdf file). This power generation should be sufficient for an average household in India and it requires around 40 square meters of roof space. The government is providing 30% subsidy to the incurred costs and accelerated depreciation up to 80%. This benefit can be claimed by both commercial and non-commercial entities, which makes PV attractive in terms of low capital cost. Besides capital subsidy, soft loan at 5% for balance cost of system excluding beneficiary share of 20% may also be available from many commercial banks and also through NABARD. If household/office power consumption is less than 675 units per month, they can either sell the surplus power to the grid or go for lesser KW (1 - 4) installation. One can also install a solar electric system that can meet part of a home/office electricity needs, offsetting 60-70% of most homeowners’ power with solar electricity, as conventional power tariffs are very cheap if we use less than 100-200 units per month.

If we come to the effective cost analysis, a 5 KW roof top solar installation typically costs around Rs. 7 Lakhs including costs of batteries (typically 1.5 Lakhs for 1 KW). Excluding the government subsidy makes the overall cost to Rs. 5 lakhs of one time investment for 25 years and that can produce 675 units of electricity per month over 25 years period. Please note that solar PV panels and related equipment costs are getting reduced and in particular photovoltaic modules cost has decreased by almost 70% in last 4 years.

For a household/office consuming around 675 units of power per month, according to the current tariff (in Andhra Pradesh), it will cost around Rs. 4200 per month (Rs. 50,000 per year), and power tariffs are getting doubled every 5 years (i.e. 12% increase every year). Even if we take the best case of just 5% increase (yearly) in power tariff, this will make the household pay around Rs. 17 Lakhs in next 20 years, and a case of 10% increase will make the sum to Rs. 29 Lakhs in next 20 years.

On the other hand, due to extreme power cuts, electricity supply through diesel generators has been a common practise in power looms, office buildings, commercial entities, malls, theatres, restaurants etc. The cost of power generated by diesel generators is about Rs 13-16 per unit and with some low efficiency engines the actual cost could be higher. The solar power is highly economical compared to the rising high cost of diesel and the incremental maintenance costs associated with diesel generators.

For example, malls in cities require electricity 24x7. There have been times during the summers, when there have been 10 hours of unscheduled power cuts. During such times, 2,000 to 3,000 litres of diesel is used and the mall shells out as much as Rs 1.5 lakh daily. Similarly, standalone restaurants (A/C) are typically consuming 30-45 litres of diesel (75 – 110 units of electricity) every day and their spending ranges between Rs. 1500-2500 daily (5 – 9 lakhs per year). For example, if we install a 20 KW solar system for similar restaurant, which costs around Rs. 18 lakhs (after subsidy). This will produce 90 units per day, where equivalent savings in diesel will be around Rs. 1800 per day (7 lakhs per year with the current fixed price of diesel).

So, solar power is at least 2 - 4 times cheaper (although it looks expensive now) in the long run when compared to the conventional power supply and significantly cheaper compared to diesel based generators. Indeed you will also enjoy the luxury of uninterrupted power (given the sun shine we have in India for all 12 months). We may not conclude that the solar roof top system is possible for every Indian house hold, but many of upper middle class families and all commercial entities, offices etc. can definitely afford it. Even the middle class families can go for these (partial or full) installations by utilizing the soft loan scheme. Solar power will not only save your money, but also save the mother earth from pollution.

According to a survey carried out by the Manufacturer's Association for Information Technology (MAIT), India Inc lost about Rs 43,205 crores (~$10 billions) in 2008-09 due to power outrages. The revenue loss due to power failure grew at an average of 11.9% in the last 5 years, which conveys India Inc might have lost Rs 2,73,172 crores in mere last 5 years. Besides manufacturing, power failure problem is more cost intensive for farmers, textiles, cement, paper, sugar mills, ceramic industries etc.