- "ఏ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాలు కూడా తమ్ము తాము నిరూపించుకోలేని పరిస్థితులలోనే.... నిర్వచనాలు లేని సిద్ధాంతాలు, నిర్మాణ సూత్రం లేని సంస్థలు, అంతిమ లక్ష్యం లేని పోరాటాలు ప్రజలను ఆకర్షిస్తాయి. అర్థంపర్థం లేకుండా డాంబికాలు కొట్టే వారే హీరోలు అయ్యే కాలం ఇది."
- "అవినీతి లోక్‌పాల్ బిల్లుల గురించి జరుగుతున్న చర్చలలో ఒక తప్పుడు అవగాహన వ్యాప్తి చెందుతున్నది. ‘లోక్‌పాల్ బిల్లు పాస్ అయితే చాలు, లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి ప్రధాన మంత్రిని చేర్చితే చాలు అవినీతి అంతం అయిపోతుంది’ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు భారతదేశంలో ఎప్పుడూ కూడా ప్రధాన మంత్రులపై కేసులే పెట్టలేదన్నట్లుగా ప్రచారం అవుతున్నది."
- నేడు లోకాయుక్త అన్ని రాష్ట్రాల్లో పేరుకు ఉన్నా.. కేవలం కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఎందుకు కొంత మేరకు ఫలితాలు ఇవ్వ కలుగుతుంది ? మానవహక్కుల, పౌర హక్కుల కమీషన్లు తెలంగాణ లో (మరీ ముఖ్యంగా వరంగల్ లో) సాధించినన్ని విజయాలు ఇంకా వేరే రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఎందుకు సాధ్యమవ్వలేదు?
- ఇక్కడ జన్ లోక్ పాల్ బిల్లును వ్యతిరేకించటం ముమ్మాటికీ నా ఉద్దేశ్యం కాదు.. కానీ అది కాస్తా "జోక్ పాల్ బిల్లు" గా మారోద్దనేదే మన అజెండా కావాలి.
‘అన్నా’ ఆరాటం సాధించేదేమిటి?
ఈ రోజు మన దేశంలో అవినీతి, లోక్‌పాల్ బిల్లు గురించి చర్చోప చర్చ లు వేడి వేడిగా సాగుతున్నాయి. దీనితో పాటు ఇప్పడు పౌరసమాజం గొప్ప దా? పార్లమెంట్ గొప్పదా? అనే చర్చ కూడా మొదలైంది. అవినీతి, యూపీఏ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకదాని తర్వాత ఒకటి కొండచిలువ అంతటి కుంభకోణాలు బయటికి వచ్చాయి. ఈ అవినీతిని చూసి దేశ ప్రజలు చలించిపోయారు. అటువంటి సమయంలోనే అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా దీక్షకు దిగారు. అదే సమయంలో ఐదు రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేక ప్రభావం పడకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చినట్లు భ్రమింపచేసింది. లోక్ పాల్ బిల్లు డ్రాఫ్టింగ్ కమిటీలోకి అన్నా హజారేను, ఆయన అనుచరులను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది .
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎవరినీ భ్రమింప చేయవలసిన అవసరం లేదు. అందుకే అవినీతిని అంతం చేస్తుంది అనుకున్న లోక్‌పాల్ బిల్లు కథ మళ్లీ మొదటికి వచ్చింది. అన్నా హజారే టీం ప్రతిపాదించిన ‘జన్ లోక్‌పాల్ బిల్’ కాకుండా కేంద్ర ప్రభుత్వం స్వంత ‘లోక్‌పాల్ బిల్లు’ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

"ఏ ప్రజా ఉద్యమానికైనా మూడు పార్శ్వాలు చాలా ముఖ్యం: 1) భావ జాల వ్యాప్తి, 2) సాముహిక ఆందోళనలు, 3) రాజకీయ ప్రక్రియ.. ఈ మూడు సమాంతరంగా కొనసాగినప్పుడే ఆ ప్రజా ఉద్యమం గమ్యాన్ని ముద్దాడే వరకు నిర్మాణాత్మకంగా నిల దొక్కుకోని, నిర్ణయాత్మక దశకు చేర గలుగుతుంది. కానీ అవినీతి అనే విష వృక్షాన్ని, ఒక జన్ లోక్ పాల్ అనే బిల్లు ఏ విదంగా నిర్ములిస్తుందో, ప్రజల్లో పూర్తి భావ జాల వ్యాప్తి కొనసాగకుండానే.. పార్లమెంట్ లో బిల్లు పెట్టండి..ఇదే సబ్ దర్ద్ కా జవాబ్ అంటే ఎలా చెల్లుతుంది ? కనీసం ఈ బిల్లు లో ఏమేం అంశాలు ఉన్నాయి, అవి ఏ విధంగా పరిపాలనా, న్యాయ, రాజకీయ వ్యవస్థలను కట్టడి చెయ్య బోతున్నాయో.. అనే విషయాలు నేడు 90% ప్రజలకు అవగాహన లేకుండానే బిల్లు ను తీస్కోస్తే.. ఆ బిల్లు ప్రతిఫలాలు ప్రజలు పొందగలరా ?
నేడు లోకాయుక్త అన్ని రాష్ట్రాల్లో పేరుకు ఉన్నా.. కేవలం కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఎందుకు కొంత మేరకు విజయాలు సాధించ కలుగుతుంది ? మానవహక్కుల, పౌర హక్కుల కమీషన్లు తెలంగాణ లో (మరీ ముఖ్యంగా వరంగల్ లో) సాధించినన్ని విజయాలు ఇంకా వేరే రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఎందుకు సాధ్యమవ్వలేదు? వీటికి కారణం అక్కడి ప్రజల్లో ఆయా ఉద్యమాల నుంచి వచ్చిన సామాజిక, రాజకీయ చైతన్యం వల్ల, ఆ ప్రాంతాల్లో ఆయా వ్యవస్థలను శాసించే అధికారాన్ని పోరాడి సాధించుకున్నారు. ప్రజలు యాచించే స్థితి నుండి శాసించే స్థాయికి చేరుకున్నప్పుడే సమాజం లో మార్పు వస్తుంది.. మార్పు అనేది ఆకాశం లోంచి ఉడి పడదు.. అది ప్రజల్లోంచి రావాలి.. అవినీతి నిర్మూలన విషయం లోను అదే జరగాలి. గ్రామ స్థాయి, క్షేత్ర స్థాయిల నుండి అవినీతికి వ్యతిరేకంగా ఓ ప్రణాళిక బద్ధంగా ధిక్కార గళాలు వినిపించాలి. ఇక్కడ జన్ లోక్ పాల్ బిల్లును వ్యతిరేకించటం ముమ్మాటికీ నా ఉద్దేశ్యం కాదు.. కానీ అది కాస్తా "జోక్ పాల్ బిల్లు" గా మారోద్దనేదే మన అజెండా కావాలి.
అవినీతి లోక్‌పాల్ బిల్లుల గురించి జరుగుతున్న చర్చలలో ఒక తప్పుడు అవగాహన వ్యాప్తి చెందుతున్నది. ‘లోక్‌పాల్ బిల్లు పాస్ అయితే చాలు, లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి ప్రధాన మంత్రిని చేర్చితే చాలు అవినీతి అంతం అయిపోతుంది’ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు భారతదేశంలో ఎప్పుడూ కూడా ప్రధాన మంత్రులపై కేసులే పెట్టలేదన్నట్లుగా ప్రచారం అవుతున్నది. కానీ పీవీ నరసింహారావు మీద అవినీతి ఆరోపణలు వచ్చిన తరువాతనే ఆయన ప్రధాని పదవికి రాజీనామా ఇచ్చారు. ఇంతకంటే చాలా ముందే 1975 లోనే ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఆరేళ్ల వరకు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చిం ది. (ఆ నేపథ్యంలోనే ఎమ్జన్సీ వచ్చింది)ఆ తరువాత కూడా అధికారంలో ఉన్న మంత్రుల పైనా, ప్రతిపక్ష నేతలపైనా ఎన్నో కేసులు నమోదు అయ్యాయి. అయినా అవినీతి అంతం కాలేదు. అవినీతికి మూలాన్ని, చికిత్సను అర్థం చేసుకోకపోవడం వల్లనే కఠినమైన చర్యల ద్వారా అవినీతిని అరికట్టవచ్చనే భ్రమలకు గురిఅవుతాము.
కొన్ని అరబ్ దేశాలలో కాళ్లు, చేతులు నరకడం, రాళ్లతో కొట్టి చంపడం లాంటి కఠినమైన శిక్షలు ఉన్నప్పటికీ నేరాలు అంతంకాలేదు. చైనాలో అవినీతికి పాల్పడిన వారికి ఉరిశిక్షలు విధించినా అవినీతి అంతం కాలేదు. అవినీతికి మూలం అధికారం. అధికారం లేనప్పుడు మంచి వారుగా ఉన్నవారు కూడా, అధికారం వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడుతున్నారు. అధికారానికి హద్దులు విధించాలన్నా, అవినీతికి గురికాకుండా చూడాలన్నా మరో అధికారిని (లోక్‌పాల్) నియమించడం పరిష్కారం కాదు. అధికారాన్ని ‘కంవూటోల్’ చేసే మీట (బటన్) ప్రజల చేతుల్లో ఉన్నప్పుడే అధికారం అవినీతికి గురికాకుండా చూడడం సాధ్యమవుతుంది. లేకపోతే చట్టాలకు ఎన్ని కోరలు తగిలించినా వాటిని అమలు చేసేవారు అవినీతి పరులైతే వాళ్లు ‘ఆకోరల’నే అవినీతికి ఆయుధాలుగా వాడుకుంటారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులే అవినీతికి పాల్పడుతున్న కాలంలో జన్ లోక్‌పాల్ అయితే ఏమిటి? మరో లోక్‌పాల్ అయితే ఏమిటి? లోక్‌పాల్ వ్యవస్థలో ఉండే వ్యక్తులు ఆకాశం నుంచి రారు కదా? ఇదే న్యాయమూర్తులు కదా లోక్‌పాల్ వ్యవస్థలోకి వచ్చేది.
అవినీతిని అరికట్టి అదుపులో ఉంచేది ప్రజలు, ప్రజా ఉద్యమాలే కానీ..స్వచ్ఛంద సంస్థలు కావు. కేంద్ర ప్రభుత్వం తన స్వంత లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు లో ప్రవేశపెట్టింది. అన్నాహజారే అతని అనుయాయులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పౌరసమాజం గొప్పదా? పార్లమెంటు గొప్పదా? అనే చర్చకూడా విస్తృతమైంది. అన్నాహజారే అతని అనుచరులపైన దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల తరువాత నుంచే ఇక పౌరసమాజానికి చెందిన వారిని లోక్‌పాల్ బిల్లు డ్రాఫ్టింగ్ కమిటీలోకి తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటినుంచే ఈ చర్చ సాగుతోంది. సీపీఐ నాయకుడు బర్దన్ కూడా ఆ ఐదుగురే (అన్నా, అతని అనుచరులు ) దేశవూపజలందరికీ ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ప్రశ్నించారు.
అవును ఈ ఐదుగురికి దేశవూపజలందరి తరఫున వ్యవహరించడానికి ఎవరు అధికారం ఇచ్చారు. అన్నాహజారే దీక్షకు కూర్చున్నప్పుడు వ్యక్తమైన ప్రజా మద్దతు వారికా అధికారాన్ని ఇచ్చిందా? (ఈ ప్రజా మద్దతుకు కచ్చితమైన ప్రమాణం ఏమీ లేదు. మీడియాలో బాగా ప్రచారం అయి తే మద్దతు వ్యక్తమైనట్లు. లేకపోతే లేదు!) పౌరసమా జం గురించిన అవగాహనను అర్థం చేసుకుంటే తప్ప కొందరు వ్యక్తులు ఇలా రాజ్యానికి వ్యతిరేకంగానూ, ధైర్యంగానూ ఎలా నిలబడగలుగుతున్నారనేది అర్థం అవుతుంది. అసలు రాజ్యానికి, పౌరసమాజానికి మధ్య ఉన్న సంబంధం కూడా అర్థం అవుతుంది.
నూతన ఆర్థిక విధానాలతో పాటు భావజాల రంగంలో బలంగా ప్రచారం అయిన భావాలలో ఒక భావన ‘పౌరసమాజం’. ఈ భావన ప్రకారం ఎవరు అధికారంలో ఉన్నా రాజ్యం అణచివేత స్వభావాన్నే కలిగి ఉంటుంది. అధికారంలో ఉన్న వారిని తొలగించి మరొకరు అధికారంలోకి వచ్చినా రాజ్యం అణచివేత స్వభావాన్నే కొనసాగిస్తుంది. ‘అధికారంలో ఉన్న వారిని తొలగించడం కంటే రాజ్యం ప్రజాస్వామ్యయుతంగానూ, అవినీతి రహితంగానూ నడుచుకునే విధంగా పౌరసమాజం కట్టడి చేస్తే సరిపోతుంది’ అనే భావం బలం పుంజుకుంది. దానిలో భాగంగానే పౌరసమాజం వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించడం కాకుండా, రాజ్యాన్ని సంస్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఈ కోణం నుంచి చూసినప్పుడు వాస్తవానికి పౌరసమాజం రాజ్యానికి ఒక కవచంలా పనిచేస్తుంది. వ్యవస్థ జోలికి పోకుండా రాజ్య నిర్వహణలోని లోపాలను మాత్రమే సవరించే సూచనలు చేస్తూ రాజ్యం పట్ల ప్రజలలో విశ్వసనీయతను పెంపొందించే పనిని చేస్తుంది.
కొందరు అనుకుంటున్నట్లుగా ఈ పౌరసమాజం రాజ్యానికి పోటీకాదు. రాజ్యానికి ప్రత్యామ్నాయం అంతకంటే కాదు. పార్లమెంట్ కంటే ఉన్నతమైనదని అది భావించుకోకుంటే.. పౌరసమాజపు సూచనలు అధికారంలో ఉన్న వారికి ఉపయోగపడేవే కాని నష్టం కలిగించేవి కావు. పౌర సమాజం, రాజ్యం మధ్య ఘర్ష ఉత్తుత్తిదే.

ఇంతకి పౌర సమాజం అంటే ఎవరు? ఈ ప్రశ్నకు కచ్చితమైన జవాబులేదు. ‘పౌర సమాజం అంటే ఇది’ అనే దానికి స్పష్టమైన నిర్వచనం ఏదీ లేదు. 1990ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. కొన్ని అమూర్త విలువలు , వాటికవే గొప్పవిగానూ, ప్రస్తుత సమస్యలకు పరిష్కారంగానూ ప్రచారం పొందుతున్నాయి. రాజ్యం ఏలుతున్నాయి. ఏ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాలు కూడా తమ్ము తాము నిరూపించుకోలేని పరిస్థితులలోనే, నిర్వచనాలు లేని సిద్ధాంతాలు, నిర్మాణ సూత్రం లేని సంస్థలు, అంతిమ లక్ష్యం లేని పోరాటాలు ప్రజలను ఆకర్షించగలవు. అర్థంపర్థం లేకుండా డాంబికాలు కొట్టే వారే హీరోలు అయ్యే కాలం ఇది.
అయితే కచ్చితమైన నిర్వచనం లేకున్నా ఇప్పుడు మాత్రం ‘పౌరసమాజం’ అంటే ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు గానే ప్రచారం అవుతున్నది. పౌరులందరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ‘పౌర సమాజం’ అంటే ప్రజా జన సామాన్య సమాజం కాదు అని. సమాజానికి ,రాజ్యానికి మధ్యన ఈ స్వచ్ఛంద సంస్థల పౌర సమాజం, సమాజపు ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యంతో మంతనాలు జరుపుతుంది. ప్రజలను సంతృప్తిపరచడానికి, రాజ్య నిర్వహణలో చేయాల్సిన మార్పులను రాజ్యానికి సూచిస్తుంది. ఈ పౌర సమాజం సూచించిన సంస్కరణలను రాజ్యం ఒకవేళ తిరస్కరించితే ఈ పౌర సమాజం కోర్టుల్లో పోరాటం తప్ప ఏమీ చేయలేదు. ఎందుకంటే ఈ పౌరసమాజానికి సమాజంలో సానుభూతో, మద్దతో ఉండవచ్చు, కానీ విశాల నిర్మాణం ఏదీ ఉండదు. అన్నా హజారే టీం సభ్యులందరు తమ ‘జన్ లోక్‌పాల్ బిల్లు’కు మద్దతు ఇవ్వాలంటూ ప్రతిపక్షపార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేయడం చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. ‘రాజకీయ పార్టీలే అవినీతికి కారణం’ అంటూ దూషిస్తూనే తిరిగి అవే రాజకీయ పార్టీల మద్దతు కోసం వెళ్లడం పౌర సమాజపు బలహీనత.
లోక్‌పాల్ బిల్లు కానీ, పౌర సమాజం కాని అవినీతిని అరికట్టే బ్రహ్మాస్త్రాలు కావు. అంతకంటే అవినీతిని అరికట్టే అధికారం గురించి ప్రజలను సామాజికంగా, రాజకీయంగా ప్రజలను చైతన్య పరిస్తే ఎక్కు వ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజావూపతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు నైతికంగా ప్రజల నియంవూతణలో ఉంటారు. ప్రజలకు సేవకులుగా, జవాబుదారిగా ఉంటారు. తద్వారా మాత్రమే కొంతలో కొంత అవినీతిరహిత సమాజం అనుభవంలోకి వస్తుంది.
Nishanth, completely agreed with you.. national media given much more publicity to this event hence a Euphoria is created among the public..
ReplyDeleteIf we seek change in society in terms of anti corruption it should first start from self motivation.. that is not even understanding by people. here ironical things most educated people are becoming prey for it