Wednesday, 10 July 2013

ఓరుగల్లు పొరుబిడ్డ


ఓరుగల్లు పోరుబిడ్డ ఒదిగిపోయెరా,
పోరులోన ఆశాజ్యోతి ఆరిపోయెరా! ॥ ఓరుగల్లు॥

కాకతీయ ప్రాంగణమ్ము కమిలిపోయెరా,
ఉస్మానియ పరిసరాలు ఉడికిపోయెరా! ॥ ఓరుగల్లు॥

మూడుతరాల ముద్దుబిడ్డ మునిగిపోయెరా,
కూలి, నాలి- బీదా,బిక్కి కుమిలిపోయెరా! ॥ ఓరుగల్లు॥

కొత్తపల్లి జయశంకర్ కొలిమి ఆయెరా,
ఎండుతున్న కడుపులల్ల మంట బెట్టెరా! ॥ ఓరుగల్లు॥

ఉడుకుతున్న ఉద్యమానికుప్పాయెనురా,
ఐక్యతనే ఆయుధంగ చేసి చూపెరా! ॥ ఓరుగల్లు॥

పొల్లుబోని మాటలింక మళ్లినలేమా,
నగుమోము నమ్మకము మేం గనలేమా! ॥ ఓరుగల్లు॥

ఆయుధాల అక్షరాలు చదువగలేమా,
కళ్లకు కట్టేటువంటి కవితలు రావా? ॥ ఓరుగల్లు॥

అరవయేండ్ల పోరు ఇంక అలసిపోయెరా,
ఆంధురోళ్ల కళ్లు ఇంక సల్లబడ్డయా? ॥ ఓరుగల్లు॥

జాతికొరకు జన్మనంత ధారపోసెరా,
తెలంగాణ బ్రహ్మగాను ఎదిగిపోయెరా! ॥ ఓరుగల్లు॥

విధిరాతను ఎదిరించలేక ఊపిరొదిపూరా,
ఆశయాల ఊపిరులు మనకు ఊదెరా! ॥ ఓరుగల్లు॥

No comments:

Post a Comment