Monday, 8 March 2010

Holi Festival -- Telangana Poems

  
కాముడు కాముడూ వల్ల, ఉల్లి కాముడు వల్ల [2]
కాముడు వచ్చిండూ వల్ల, కందులెయ్యండి వల్ల [2]
భీముడు వచ్చిండూ వల్ల, బియ్యమెయ్యండి వల్ల [2]
రాముడు వచ్చిండూ వల్ల, రంగులు గుప్పండి వల్ల [2]
అన్నదమ్ములు గూడి వల్ల, బాయి దవ్వించే వల్ల [2]
బాయిల్లా ఉన్నాది వల్ల, బంగారు బిందే వల్లా [2]
బిందెల ఉన్నాది వల్ల, బంగారి చెంబూ వల్ల [2]
-------------------------------------------- 
పుల్లలు పుల్లాలు ఎన్నియల్లో మరి లవంగ పుల్లాలు ఎన్నియల్లో [2]
లవంగ పుల్లాలు ఎన్నియల్లో మరి నమిలితే వాసనలు ఎన్నియల్లో [2]
గోప్పేడు గంధాలు ఎన్నియల్లో మరి దొర్లితే వాసనలు ఎన్నియల్లో [2]
తిప్పేడు గంధాలు ఎన్నియల్లో మరి చిల్లితే వాసనలు ఎన్నియల్లో [2] 
పుల్లలు పుల్లాలు ఎన్నియల్లో మరి లవంగ పుల్లాలు ఎన్నియల్లో [2]
-------------------------------------------- 
రింగుడు బిల్లా - రూపాయి దండ, దండ కాదురా - జాతర మొగ్గ
మొగ్గ కాదురా - మోదుగు నీడ, నీడ కాదురా - నిమ్మల బాయి
బాయి కాదురా - బొర్సేల్ల కూర, కూర కాదురా - గుమ్మడి పండు
పండు కాదురా - పాపయ్య మీసం, మీసం కాదురా - మిర్యాల పొట్టు
పొట్టు కాదురా - కొత్తి మీరా కట్ట, కట్ట తీసి - నీ నెత్తిన కొట్టా
-------------------------------------------- 
హోలీ హోలీలా రంగ హోలీ చమ్మకేలిలా హోలీ....[3]
హోలీ పండగొచ్చినాదే హోలీ చమ్మకేలిలా హోలీ [2] 
ఆయీ లేక బాయి లేక ఆడుకుందాం మనం [2]
కులం లేక మతం లేక ఆడుకుందాం మనం [2] 
హోలీ హోలీ రంగ హోలీ చమ్మకేలిలా హోలీ..
సప్త స్వరాల పాటలతో పంచ రంగుల ఆటలతో
రాగ రంజితమయ్యే కేళి మన తెలంగాణా హోలీ
-------------------------------------------- 

No comments:

Post a Comment