Friday, 2 September 2011

T News Exclusive Report & Debate On Andhra Kutralu By Roshayya Nadendla & CBN

ఆంధ్రోళ్ల కుట్రల బాకులు
- మొన్న రోశయ్య... నేడు మనోహర్ - తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్‌లు
- విద్యార్థి జేఏసీలోని రాడికల్స్‌లో 30 ఏళ్లు పైబడిన మాదిగలే ఎక్కువ - స్పీకర్ నాదెండ్ల తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు
- కాన్సులేట్ అధికారులతో సంభాషణ - అలా అనలేదన్న స్పీకర్ మనోహర్
- నియామకానికి ముందే చిదంబరంతో నరసింహన్ భేటీ - తివారీ వ్యతిరేక మీడియా కథనంపైనా సందేహాలు
- తెలంగాణపై సాగదీయడమే కాంగ్రెస్ వైఖరి - అమెరికాకు హైదరాబాద్ కాన్సులేట్ కేబుల్! - వెల్లడించిన వికీలీక్స్









తెలంగాణపై Amint-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema కుట్రలకు ఎన్ని సీమాంధ్ర బాకులో! ఒక్కో సమయంలో ఒక్కోటి బయటపడుతున్నది! మొన్న రోశయ్య అవతారం.. చంద్రబాబు వ్యవహారం! పెండింగ్ జాబితాలో లగడపాటి సహా అనేక మంది ఘనాపాఠీలు! ఇప్పటి వంతు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన స్పీకర్ నాదెండ్ల మనోహర్! తాను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కాలంలోనే తెలంగాణ ఉద్యమాన్ని నక్సలైటతో ముడిపెట్టారు నాదెండ్ల! మావోయిస్టులు రిక్రూట్‌మెంట్‌లు పెంచుకుంటున్నారట.. ఉద్యమంలో మాజీ నక్సలైట్లు ఉన్నారట..
విద్యార్థి జేఏసీలో అందరూ 30ఏళ్లకు పైబడిన మాదిగలేనట.. చదువులు పోయినా సరేనంటూ వారు ఉద్యమంలో పని చేస్తున్నారట! ఎవరో కోన్‌కిస్కా అధికారుల వద్ద చేసిన వ్యాఖ్యలు కావివి... సాక్షాత్తూ హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ అధికారులతో అన్న మాటలు! ఇవికాస్తా దౌత్య కేబుళ్ల రూపంలో అమెరికా చేరాయి! అమెరికా విధానాలను ఎండగడుతూ, వాటి రహస్య దౌత్య పత్రాలను బహిర్గతం చేస్తున్న సాహసి.. వికీలీక్స్.. వాటిని బయటపెట్టింది! తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను వెల్లడించింది. అంతేకాదు.. రాష్ట్ర గవర్నర్‌గా తివారీ తొలగింపు, ఆయన స్థానంలో నరసింహన్ రాకపై తమ అభివూపాయాలను, మీడియా కథనాలను అమెరికాకు చేరవేసిన దౌత్య కేబుళ్లను సైతం వికీలీక్స్ బయటపెట్టింది! తెలంగాణకు వ్యతిరేకంగానే గవర్నర్‌ను నియమించారన్న వాదనలపై కొత్త చర్చకు తెర తీసింది!!

No comments:

Post a Comment