నేటితో నాకు అది గతం...!!
పాతికేండ్ల గతాన్ని
సురంలా మింగితే
భవిష్యత్తు అంతా
నిషా నిజం...!!
చెట్లు కదిలితే ఎంత వినాశకరమో
అట్లా చీకట్లు నడుస్తున్నాయి
నేటి యాంత్రిక ప్రపంచంలో...
పుట్టుకతోనే వ్రుద్ధులైనట్లు
అంతా నిద్ర పోతున్నారు నీడల్లో
కాల రాక్షసి అడుగుజాడల్లో.... !!
చుట్టూ కలుముకున్న
నిషా పరదాని
లేపి లేపి
తూర్పు గట్టు నుండి
చీకటింటి తలుపుతోసి
పిలుస్తోంది
పొడుస్తున్న పొద్దు...!!
ఆ ఉదయం సవ్వడి వింటే చాలు
రాయి కూడా ఒళ్ళు విరుచుకుంటుంది
అలా పుట్టుకొచ్చే పొద్దుకు నా నేత్రాలు
స్వాగత పత్రాలయ్యాయి
ఒక్కొక్క కిరణావళి
స్ప్రుశిస్థూ ఉంటే
నా ప్రాణాలు బావుటాలై
రెపరెపలాడుతున్నాయి
ఆ సూర్యోదయమే
బ్రతికున్న శవంలా పడి ఉన్న నన్ను
కరిగించింది కదిలించింది
కాలానికి ఆశ్వగతులు నేర్పుతూ...!!
నాలో మొలిచింది ఒక బీజం
నిరంతర వికాస వృద్ధి కోసం
నేను వృద్ధున్ని కాదు
రాబోయే యుగానికి కాబోయే దూతవి
కావాలంటూ వేయించింది
రేపటి ప్రస్థానం వైపు నా అడుగులు....!!
----------------------------------
-- నిశాంత్ దొంగరి
-- నిశాంత్ దొంగరి