"గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో ? -- ఆ కవిని కవనాలు ప్రశ్నిస్తున్న వేళ"
మన తనువులు
ఒకరికొకరం..
కేవలం పేర్లమేనా
పదాలమేనా
ధ్వని మాత్రమేనా
లేక
భూత భవిష్యత్తులకు నోచుకోని
వర్తమానమేనా...
సంయోగం సంభవం కాని
ఏకాంతతత్వమా
నీ భాషలో కానీ, నా భాషలో కానీ
ఏ భాషలో కానీ
విడమరచి చెప్పలేని
వాక్యంగా రుపుదిద్దుకోజాలని
పదాలమా ?
ప్రాణం ఉన్నా
రూపానికి నోచుకోని
ఆత్మలమా ?
మన తనువులు
ఒకరికొకరం..
కేవలం పేర్లమేనా
పదాలమేనా
ధ్వని మాత్రమేనా
లేక
భూత భవిష్యత్తులకు నోచుకోని
వర్తమానమేనా...
సంయోగం సంభవం కాని
ఏకాంతతత్వమా
నీ భాషలో కానీ, నా భాషలో కానీ
ఏ భాషలో కానీ
విడమరచి చెప్పలేని
వాక్యంగా రుపుదిద్దుకోజాలని
పదాలమా ?
ప్రాణం ఉన్నా
రూపానికి నోచుకోని
ఆత్మలమా ?
No comments:
Post a Comment