మనసొక అనంత విశ్వం
అది ఆగమ్యం
అన్వేషిస్తుంది గమ్యం
అదొక శూన్యం
అవలోకిస్తుంది కామ్యం
అది కాలతిరిక్తం-
ఆరు ఋతువులు ఒక లిప్తలో
అది యోగాభిశిక్తం-
ఉదయామ్శువులు ఆ సుఘుప్తిలో
ఎప్పుడు చినుకవుతుందో ?
ఎప్పుడు పిడుగవుతుందో ?
ఎప్పుడు అడుగేస్తుందో ?
ఎప్పుడు మడుగవుతుందో ?
ఎప్పుడు నవ్వుతుందో ?
ఎలా ఎలా నవ్వుతుందో ?
మనసొక మహా సాగరం
తాను కట్టుకున్న చెలియలి కట్టను
తానే కబళించాలని చూస్తుంది
తన తోబుట్టువైన ధరాతలాన్ని
తానే తాగేయాలని చూస్తుంది
హోరేత్తుకుంటూ ఉరికి ఉరికి వస్తుంది
నోరోత్తుకుంటూ తిరిగి తిరిగి పోతుంది
తనలో అందాలను పరుచుకుంటుంది
తానే ఆకాశమంతా కమ్మేయాలని
తహతహలాడిపోతుంది.
మధురిమలేన్నెన్నో నింపుకున్నా
తనకు నిలిచినా రూపమొక్కటే
తనకు మిగిలిన రుచి ఒక్కటే
అనంత జలరాశి తానైనా
ఆర్పుకోలేదు తనలోని చిచ్చును
తనపై ఎంత తెలుపు కురుస్తున్నా
మాపుకోలేదు తన మేని నలుపును
హిమగిరులపై ఎగిసే మనసే
ఇరుకు లోయల్లో చొరబడుతుంది
అరునోదయాలను ప్రతిష్టించే మనసే
పిరికి చీకట్లలో దిగబడుతుంది
పసిమిని తెగ మేసి
ఇసుకను నెమరేస్తుంది
మండుటిసుకను మింగి
మాగాణులను పుక్కిలిస్తుంది
విత్తుగా ఉంటూనే
వృక్షమై కూచున్టుంది
అంతరిక్షంగా ఉంటూనే
అణువులా కుదిన్చుకుంటుంది.
No comments:
Post a Comment