కొమ్మ చాటు కోయిలలా నల్లని కురుల చాటు నీ ముఖం ||
మబ్బు చాటు వెన్నెలలా నీ రెప్ప చాటు కంటి పాపలు ||
ఇన్ని దినాలు ఉన్న విషయాన్ని నాకు చేరనివ్వట్లేదనుకున్న ||
సిగ్గుతో తల దించి నడుస్తూ నీ ముసి ముసి నవ్వుల,
బాణాలతో నాకు సైగలు పంపటమే నేర్చుకుంటివా ||
నమ్మలేని ఈ నిజం కోసం కాల చక్రాన్ని ఆపనా ||
నమ్మదగిన ఈ కల కంటూనే నీ ధ్యాసలో లినమైపోనా ||
అస్సలు గుప్పెడంత ఈ గుండెకి కొండంత ఆశలెందుకో ?
-------------------------------------------------
రాబోయే రోజుల ఊహల కదన రాగమువా
సరిగమలు తెల్వని నా యదలోని సప్తస్వరానివా..
మూగబోయిన నా మనసులో కవనం రాసే మౌనానివా..
తూరుపు పడమరలను కలిపే ఇంద్రధనస్సువా..
ప్రతిఘటించలేని ఘాటైన ప్రేమఘటనవా
కాటుక చీకటి రేయిలో తోవను చూపే వెలుగువా
No comments:
Post a Comment