Tuesday, 20 April 2010

Random Thoughts From Red Man.....

ఓ పోరి ఓ మారు పో పో పోరా అంటావ్..
మరు క్షణమే రా రా అని మేఘసందేశమిస్తవ్
 
దూరం పోతే ఉపిరాడట్లేదంటావ్...
మరి చెంతకొస్తే సుడి గాలినంటావ్..

ఏడడుగులు నీతో వెయ్యమంటావ్ కానీ
నన్నేమో ఏడు సముద్రాల అవతల వదిలేస్నవ్

నా మనసులోని రాజ్యానికి యువ రాణినని..
నీ గుండెలో నన్ను యుద్ధ ఖైదీని చేస్నవ్

కృష్ణుడి పై సత్యభామలా ఈ పంతం దేనికే
నీ మనసుతో నీకే ఈ అంతర్యుద్ధం ఎందుకే

ఈ నిశా రాత్రిలో ఒంటరి పయనం ఎక్కడికే..
ఆ నిశా అంతం చేసే చంద్రునిగా నే ఉండగా

చందమామ మబ్బుల్లో కొద్దిసేపు దాక్కుందని
వెన్నెలను జీవితాంతం వెలి వేస్తామా

నీ ఆత్మ నీకు ఎప్పటికి కనపడట్లేదని 
నీ ఉనికి మీదనే అనుమానపడ్తావా
పీడ కలలాంటి గతంలోంచి మేలుకో చెలియా
రేపటి ప్రతి క్షణం పరవశమే ప్రియతమా

4 comments: