Thursday, 25 August 2011

ఆ ఘంటాపధ వ్యాఖ్యానాలు







ఆ ఘంటాపధ వ్యాఖ్యానాలు
 





బధిరలోక  మాలించిన 

రుధిర గీతికా రావాలను

ఆలపిస్తున్నాయ్.......
పతితజాత మేలెంచిన 

భవిష్యదాశారుణ భావాలను

వ్యాప్తి జేస్తున్నయ్
 
అవే ....

కాలఘంటిక చూపిన నిజాలు

కష్ట నష్టాలను మోసిన బుజాలు
  









ఇవే....


రేపు కాబోయే మార్పులు

రాబోయే ముందు యుగపు దుతాస్త్రాలు

రెచ్చిన కన్నీటి గాధలకు ఓదార్పులు

No comments:

Post a Comment