మా తెలంగాణ గడ్డ మీద రామన్నలో
ఆంధ్రోని కళ్ళు పడ్డయమ్మ రామన్నలో
మా హైదరాబాద్ షహర్ మీద రామన్నలో
వాని డేగ కళ్ళు పడ్డయమ్మో రామన్నలో
మా తెలంగాణ నీళ్ళ మీద రామన్నలో
వాని దిష్టి కళ్ళు పడ్డయమ్మో రామన్నలో
మా సింగరేణి సిరుల మీద రామన్నలో
వాని దొంగ కళ్ళు పడ్డయమ్మో రామన్నలో
మా రామగుండం వెలుగు మీద రామన్నలో
వాని రాకాసి కళ్ళు పడ్డయమ్మో రామన్నలో
మా గొలుసు కట్టు చెర్లను చూసో రామన్నలో
గుడ్ల గూబ కండ్లు పడ్డయమ్మో రామన్నలో
మా నల్లా రేగల్లను చూసి రామన్నలో
వాడు కండ్లల్ల మట్టి పోసుకుండో రామన్నలో
తెలుగు భాష ఒక్కటాని రామన్నలో
సుట్టరికాం చెయ్య వచ్చే రామన్నలో
అరె సుట్టమోలె వచ్చినోడు రామన్నలో
వాడు దయ్యమయ్యి పట్టినాడే రామన్నలో
అహ ఇస్సుంట రమ్మంటే రామన్నలో
వాడు ఇల్లంత నాది అంటాన్డే రామన్నలో
అరె యాడ చుసిన-ఆంధ్రోడే రామన్నలో
తెలంగాణ నిండ వారే రామన్నలో
మా సెక్రటేరియట్ అడ్డ మీద రామన్నలో
వాడు తిష్ట వేసి కూసున్డే రామన్నలో
నేడు తెలంగాణ వాసులకు రామన్నలో
అయ్యో ఊరు లేదు పేరు లేదు రామన్నలో
నా తెలంగాణ తమ్ములకు రామన్నలో
అయ్యో సదువుకున్న కొలువు లేదు రామన్నలో
నా తెలంగాణ రైతులకు రామన్నలో
అయ్యో కాల్వలున్నా.. నీళ్ళు రావు రామన్నలో
మా బతుకమ్మ పండుగాను రామన్నలో
వాడు బుగ్గి పాలు చేసినాడే రామన్నలో
మా జానపద పాటలను రామన్నలో
వాడు అగ్గి పాలు చేసినాడే రామన్నలో
మా తెలంగాణ సంపదను రామన్నలో
వాడు చౌక బారు చేసినాడే రామన్నలో
మా తెలంగాణ ఫాక్టరీలను రామన్నలో
వాడు బాయిలేసి బొంద పెట్టే రామన్నలో
నాటి గొర్లు తినేటోడు పోయి రామన్నలో
నేడు బర్లు తినేటోడు వచ్చినాడే రామన్నలో
నాటి రత్నాల తెలంగాణను రామన్నలో
నేడు రావణ కాష్టం చేసినాడే రామన్నలో
No comments:
Post a Comment