ఈ మధ్య మంత్రి టి.జి. వెంక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమవుతే శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమకు చెందుతుంది-ఎందుకంటే శ్రీశైలం మా ప్రాంతంలో కట్టబడింది. పైపెచ్చు ఆ డ్యాం మూలంగా రాయలసీమ వాళ్లు చాలా మంది నిరాక్షిశయులయ్యారు అని అన్నారు. ఇది ఎంతవరకు నిజం?
హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగం కనుక హైదరాబాద్ లేకుండా తెలంగాణ అంగీకరించే ప్రసక్తే లేదు అని తెలంగాణ వాదులు కరా ఖండిగా కేంద్రానికి చెప్పిన సందర్భంగా కౌంటర్‌గా మంత్రి వెంక హైదరాబాద్ తెలంగాణకు ఇస్తే మాకు శ్రీశైలం ఇవ్వవలసి ఉంటుందన్న వాదన తెరమీదకు తెచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం వాదనకోసమే అలా మాట్లాడి ఉండొచ్చు. లేదా మంత్రి గారికి ఆ కోరిక ఉండొచ్చు. ఏదేమైనా శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రాజెక్టు-భారతదేశపు ప్రాజెక్టు- దానిపైన ఎవరికీ పేటెంట్ హక్కు లేదు. అది జాతిసొత్తు ప్రజల సొత్తు ఆ ప్రాజెక్టును కృష్ణా నదిపైన నిర్మించారు. డ్యాంకు కుడిపక్క కర్నూలు జిల్లా ఎడమ పక్క మహబూబ్‌నగర్ జిల్లా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు మూలంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ పరిధిలో 27, అలంపూర్ పరిధిలో 29 గ్రామాలు, వనపర్తి పరిధిలో 11 గ్రామాలు, మొత్తం 67 గ్రామాలు, కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు పరిధిలో 32 గ్రామాలు, ఆత్మకూరు పరిధిలో 14 గ్రామాలు, కర్నూలు పరిధిలో 4 గ్రామాలు, మొత్తం 50 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఇక ముంపుకు గురయిన భూమి విషయానికి వస్తే మహబూబ్‌నగ ర్ జిల్లాలోని 1546 ఎకరాల మాగాణి, 429 29 ఎకరాల మెట్ట, 7952 ఎకరాల బంజరు పోరంబోకు భూమి ఇలా మొత్తం 54 807 ఎకరాల భూమి కాగా కర్నూలు జిల్లాలోని 2028 ఎకరాల మాగాణి, 47029 ఎకరాల మెట్ట, 5294 ఎకరాల బంజరు పోరంబోకు భూమి వగైరా మొత్తం 52541 ఎకరాలు, నీట మునగడం జరిగింది.ఈ వివరాలను బట్టి ఏం తెలుస్తోంది.
ఒకటి- మహబూబ్‌నగర్, కర్నూలు, జిల్లాలు శ్రీశైలంకు ఇరు పక్కలా ఉన్నాయని, రెండు -కర్నూలు జిల్లా కన్న మహబూబ్‌నగర్ జిల్లాలోనే అటు గ్రామాలు కానీ భూములు కానీ ఎక్కువగా ముంపునకు గురయ్యాయని. ఈ నేపథ్యంలో శ్రీశైలం రాయలసీమకే చెందుతుందనడంలో ఏ మాత్రం ఔచిత్యం ఉందో పాఠకులే అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టులో రెండు విద్యుత్ కేంద్రాలున్నాయి. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం 900 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం 700 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. మొత్తం విద్యుత్ సామర్థ్యం 1670 మెగావాట్లు- ఇక నీటి వినియోగానికి వస్తే కొన్ని విచివూతమైన విషయాలు బయటపడతాయి.
శ్రీశైలం ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం విద్యుదుత్పాదన. విద్యుత్తు ఉత్పత్తి చేసి నీటిని దిగువ ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేయడం. అంటే నాగార్జునసాగర్‌కు ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగపడుతుందన్న మాట. ఈ ప్రాజెక్టు నుండి నేరుగా సాగు కోసం నీటిని తరలించ కూడదని, కృష్ణానదీ జలాలను మూడు రాష్ట్రాలకు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌కు పంచిన బచావత్ ట్రిబ్యునల్ తమ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. శ్రీశైలంలో నిలువ చేసిన నీరు శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి చేసాక నాగార్జునసాగర్‌లో విద్యుత్తు ఉత్పత్తి చేసిన అనంతరం అంతిమంగా సాగర్ ఆయకట్టు కృష్ణాడెల్టా ఆయకట్టుకు ఉపయోగపడుతుంది. కాబట్టి శ్రీశైలంలో ఆవిరి నష్టానికి 33 టి.ఎం.సి ల నీటిని ట్రిబ్యునల్ ప్రత్యేకంగా కేటాయించింది. శ్రీశైలం మాదిరిగానే మేము కూడా ‘ కోయినా ప్రాజెక్టు’ను విద్యుత్తు ఉత్పాదన కోసమే కట్టుకున్నాం.
Full Article @ Namasthe Telangana
--
ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలవనరుల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
No comments:
Post a Comment