వదినమ్మ వేసినదీ పచ్చని పైట
అన్న మొఖంలో పూసినదీ ఎర్రని పూత
ఇల్లంతా కురిసనదీ అమృత వర్షం
మందారమ్మ విచ్చినదీ...అందాల బొమ్మ నీదిరో
ఆ అందమంతా నీదిరో.. ఆ అందమంతా నీదిరో..
నీ నవ్వు చల్లని వెన్నెలయ్యింది
నీ సూపు వెలిగే దీపమయ్యింది
నీ పెండ్లి కోసం..
ముత్యాలు పూసినయిరో..మంత్రాలు వల్లించినాయ్
నీ స్పర్శ తగలంగనే కొత్తగా మురిసినయిరో
యాడ దాగున్నావురో.. సూడ సక్కనోడ మదినా సుందరుడా
యే మాయ చేసినావురో.. సూడ సక్కనోడ మదినా సుందరుడా
యే మాయ చేసినావురో...
కలువల చెలి నీదయ్యిందీ
యే మాయ చేసినావురో...
ముద్దు గుమ్మని వరిస్తున్నావ్
యే మబ్బుల్ల దాగున్నావురో... యాడ సరసమాడుతున్నావో..
మా వదినమ్మ అండ దండ నువ్వేరో
సూడ సక్కనోడ మదినా సుందరుడా
ఆమెకు రాముడసువంటి వోడివిరో
సూడ సక్కనోడ మదినా సుందరుడా
మా బల రామన్న నువ్వేరో
సూడ సక్కనోడ మదినా సుందరుడా
No comments:
Post a Comment