Monday 11 July 2011

ఓ వలసాంధ్ర మీడియా ప్రతినిధులారా..!

ఓ వలసాంధ్ర మీడియా ప్రతినిధులారా..!
భారత దేశ చరిత్రలోనే ఓ గొప్ప మలుపు వస్తాంది
ఈ చారిత్రాత్మక ఘట్టంలో
మీ గళాన్ని.. మీ కలాన్ని..
మీ సాహిత్యాన్ని.. మీ రంగు డబ్బాలను..
ఎవరి కోసమో తేల్చుకోండి..!

అర్ద శతాబ్దపు వలస పాలనలో
నిరంతర దోపిడీకి గురై
ఆశయాసులైన పీడితుల కోసమా...

లేదా.. పీడితుల పొట్ట కొట్టి
సమైక్య వాదం పేరిట
4 కోట్ల జనాలను పీడించుకొని
తిన్నదరగక ఒల్లు బలిసిన
గుప్పెడు స్వార్ధ పరుల కోసమా..

తేల్చుకోండి మీరు...!

ప్రపంచం లోకి ప్రజలు వస్తున్రు
ప్రజా పోరాటాలు నిర్మాణం ఐతున్నయ్

రాజుల సామ్రాజ్యాలే కులిపోతున్నాయ్
400 ఏండ్ల నిజాం సామ్రాజ్యాన్నే పెకిలించినం
ఉసిల్ల పుట్టలై..బతుకమ్మ పాటలై..
ఒగ్గు డప్పులై..బాల సంతల గంటలై..

ఎముకల సప్పుడై..తీన్ మార్ దెబ్బలై..
తుడుం మోతలై..అమర వీరుల స్వప్నాలై.. మోగుతున్న

ఆత్మగౌరవ పోరాటానికి మోకాలద్దేయ్యకండి
మీ కోటలకు బీటలు వారే రోజులు దగ్గర పడ్డాయ్
------------------------------​----------------------
చీమల దండులు కదిలినయ్
పాముకు గుండెలు అదిరినయ్

మేక పోటేల్లు దున్కినయ్..
తోడేళ్ళు తోక ముడిసినాయ్

ఆవుల మందలు కలిసినయ్..
నక్కలు పరుగులు తీసినయ్...

ఆగదు ఆగదు...
ఈ ఆకలి పోరు ఆగదు
ఈ వలస పాలన అంతం వరకు
ఈ ఆత్మ గౌరవ పోరు ఆగదు

ఆగదు ఆగదు...
ఈ స్వరాష్ట్ర పోరు ఆగదు..

తర తరాల ఈ దోపిడీ
ఇక సాగదు సాగదు సాగదని
తెలంగాణ యువతరము..
కత్తులు నూరుతున్నది

దుక్కులు దున్నిన నాగలి..
ఆ లాంకో కావూరి హిల్స్ నాయ్అంటున్నవి

మొక్కలు నాటిన చేతులు..
ఈ పార్కులు నాయ్అంటున్నవి

రాళ్ళను మోసిన ఆ దేహాలు
ఈ టాంక్ బండ్ మాదంటున్నది

ఆగదు ఆగదు
ఈ ఆకలి పోరు ఆగదు
ఈ వలస పాలన అంతం వరకు
ఈ ఆత్మ గౌరవ పోరు ఆగదు ||

బాంచెన్ అన్న బతుకులు
బద్దలు ఎత్తుతున్నరు

గులాములన్న జీవులు
గొడ్డల్లెత్తుతున్నారు

తీన్మార్ డప్పులు
దన దన మోగినాయ్
అడ్డం అచ్చిన దోపిడీ దొంగల
ఘోరీలు కడ్తున్నారు

ఆగదు ఆగదు...
ఈ ఆకలి పోరు ఆగదు

ఆగదు ఆగదు...
ఈ స్వరాష్ట్ర పోరు ఆగదు...

ఎంతవరదాకైతే దోపిడీ పాలన కొనసాగుతుందో
అంతవరదాక తిరుగుబాటు ఉంటది
జబ్ తక్ ఇన్సాన్ భూఖా హై
తబ్ తక్ థూఫా రహేగా..
"Wherever there is injustice there cannot be peace -- Vinoba Bhave"
జై తెలంగాణ జై జై తెలంగాణ --

No comments:

Post a Comment